News April 9, 2025

శుభ ముహూర్తం (09-04-2025)(బుధవారం)

image

తిథి: శుక్ల ద్వాదశి రా.11.56 వరకు
నక్షత్రం: మఖ ఉ.11.16 వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36-ఉ.12.24 వరకు
వర్జ్యం: రా.7.49-రా.9.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.9.08-ఉ.10.48 వరకు

Similar News

News April 23, 2025

ప్రభాస్ సినిమాలో ‘మార్కో’ స్టార్?

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలున్నాయి. ఓ కీలక పాత్ర కోసం డైరెక్టర్ ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ పోలీసుగా కనిపించనున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ ఇటీవల ‘మార్కో’ సినిమాతో హిట్ అందుకున్నారు.

News April 23, 2025

మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు?

image

TG: తెలంగాణలో పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ఎస్సెస్సీ బోర్డు ఎదురుచూస్తోంది. అందులో మార్కులు ఎలా ముద్రించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.

News April 23, 2025

ఫలితాలు రాకముందే ఆత్మహత్య.. తీరా రిజల్ట్స్ చూస్తే..

image

TG: గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని బాధతో రిజల్ట్స్ రాకముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతనికి నిన్న వచ్చిన ఫలితాలలో 391 మార్కులు వచ్చాయి. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల్లో విఫలమయ్యామని మనస్తాపంతో ఐదుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

error: Content is protected !!