News February 12, 2025
శుభ ముహూర్తం (12-02-2025)

✒ తిథి: పూర్ణిమ రా.7.08 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష రా.7.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: ఉ.8.03 నుంచి ఉ.9.41 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 నుంచి సా.7.35 వరకు
Similar News
News March 15, 2025
కొడుతూ పోలీసులు టార్చర్ చేస్తున్నారు: నటి

కస్టడీలో తనపై భౌతిక దాడి జరుగుతోందని నటి రన్యారావు ఆరోపించారు. పోలీసులు పలుమార్లు తనను కొట్టారని, ఆహారం ఇవ్వడం లేదని ఆమె జైలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తెల్ల కాగితాలపై సైన్ చేయాల్సిందిగా DRI అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకేమీ తెలియదని, తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె అరెస్టవ్వడం తెలిసిందే. CBI, ED సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
News March 15, 2025
భద్రాద్రిలో 64 మంది మావోల లొంగుబాటు

TG: భద్రాద్రి జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 64 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఇవాళ ఓ మంచి రోజు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం శుభపరిణామం’ అని ఆయన పేర్కొన్నారు.
News March 15, 2025
RCB: ఈసారైనా కప్ నమ్‌దేనా..!

IPL ఆరంభం నుంచి టైటిల్ కోసం RCB విశ్వప్రయత్నాలు చేస్తోంది. 17 సీజన్లు గడిచినా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారైనా ఆ జట్టు కప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగలిగే RCBలో కోహ్లీ, పాటీదార్, లివింగ్‌స్టోన్, సాల్ట్, బేథేల్, జితేశ్, డేవిడ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లోనూ యశ్ దయాల్, భువీ, ఎంగిడి, హేజిల్‌వుడ్, తుషార్ ఉన్నారు. మరి RCB ఈసారి కప్ కొడుతుందా?