News January 26, 2025
శుభ ముహూర్తం (26-01-2025)

✒ తిథి: బహుళ ద్వాదశి రా.7.17 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట ఉదయం 7.08 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1) సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: సా.3.30-5.09 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.34-3.13 వరకు
Similar News
News February 15, 2025
పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా బెనర్జీ

బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్, హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి చేసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా వీరు ఒక్కటయ్యారు. ప్రతీక్‌కు ఇది రెండో వివాహం కాగా ప్రియాకు మొదటిది. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. కాగా ప్రియా బెనర్జీ ‘జోరు’, ‘అసుర’, ‘కిస్’ తదితర సినిమాలతోపాటు ‘రానానాయుడు’ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
News February 15, 2025
వైరల్ కంటెంట్: హాయిగా నవ్వుకోండి!

Way2News వైరల్ కంటెంట్‌లో ఇటీవల వచ్చిన ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. సూర్యుడిని భార్యగా, దాని చుట్టూ తిరిగే గ్రహాన్ని భర్తగా వర్ణించి సరదాగా క్రియేట్ చేసిన ఈ పోస్ట్ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు చూడని వారి కోసం, మళ్లీ మీ మోములో నవ్వులు పూయించేందుకు మరోసారి ఆ పోస్టు పబ్లిష్ చేస్తున్నాం. హాయిగా నవ్వుకోండి మరి.
News February 15, 2025
టీవీ, ఫోన్ చూస్తూ తింటున్నారా?

కొందరికి తినేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడటం అలవాటు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ఫోన్ చూస్తూ తినే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఎంత తింటున్నామో తెలియకుండా అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీంతో ఊబకాయం, గ్యాస్, పొట్ట, అరుగుదల, ఒత్తిడి, కళ్లు బలహీన పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. తినేటప్పుడు వీటిని చూడకపోవడం ఉత్తమం.