News December 31, 2024
శుభ ముహూర్తం (31-12-2024)
✒ తిథి: శుక్ల పాడ్యమి తె.4:00 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.09 వరకు
✒ శుభ సమయం: మ.12.10 నుంచి 1.00 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు. తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా. 10.25 నుంచి 12.00 వరకు
✒ అమృత ఘడియలు: రా. 8.07 నుంచి 9.47 వరకు
Similar News
News January 26, 2025
అజిత్‌కు ‘పద్మ భూషణ్’; కరెక్టా? కౌంటరా?
కోలీవుడ్ హీరో అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై తమిళనాట డివైడ్ డిస్కషన్ అవుతోంది. ఇది తగిన గౌరవమని తల ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇందులో BJP రాజకీయం ఉందని విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో MGR, కమల్ పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేషన్, రజినీకాంత్‌లకు ఇలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో పార్టీ ప్రకటించాక అజిత్‌కు అవార్డుతో కౌంటర్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.
News January 26, 2025
మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News January 26, 2025
మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..
ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.