News February 18, 2025
శుభ ముహూర్తం (మంగళవారం, 18-02-2025)

తిథి: బహుళ షష్ఠి తె.4.34 వరకు
నక్షత్రం: స్వాతి
రాహుకాలం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, తిరిగి రా.10.48- రా.11.36
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.32 వరకు
అమృత ఘడియలు: రా.9.51 నుంచి రా.11.33 వరకు
Similar News
News April 17, 2026
దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు

మహిళా బిల్లు వీగిన నేపథ్యంలో విపక్షాల తీరును ఎండగడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని NDA నిర్ణయించింది. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో BJP మహిళా నేతల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరగనున్నాయి. మూడు వారాల పాటు వీటిని కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిరసనలతో ప్రతిపక్షాల వైఖరి గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
News April 17, 2026
రాణించిన గ్రీన్.. KKR స్కోర్ 180

IPLలో రూ.25.2 కోట్ల ఆటగాడు <<19653410>>కామెరూన్ గ్రీన్(KKR)<<>> ఎట్టకేలకు తన స్థాయికి తగ్గట్లు ఆడారు. GTతో మ్యాచులో 32కే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగుకు వచ్చి 55 బంతుల్లో 79 పరుగులు(4 సిక్సులు, 7 ఫోర్లు) చేశారు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 180 స్కోరుకు ఆలౌటైంది. టిమ్ 19, రహానే 0, రఘువంశీ 8, పావెల్ 27, అనుకుల్ 9, రింకూ 1, రమణ్‌దీప్ 17 రన్స్ చేశారు. రబాడ 3, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు.
News April 17, 2026
మహిళలకు వారి హక్కులు దక్కనివ్వలేదు: అమిత్ షా

రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు మహిళల హక్కు అయిన 33% కోటా వారికి దక్కనివ్వకుండా చేశాయని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల మనస్తత్వం మహిళలకుగానీ, దేశానికిగానీ అనుకూలంగా ఉండదని మండిపడ్డారు. నారీశక్తికి జరిగిన ఈ అవమానానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై ప్రతిఎన్నికల్లో ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని Xలో పోస్ట్ చేశారు.


