News January 4, 2025

ఆసీస్ ఆలౌట్

image

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టులో ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 185 రన్స్ చేయగా ఆస్ట్రేలియా 4 రన్స్ వెనుకంజలో నిలిచింది. టీమ్ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 3, బుమ్రా 2, నితీశ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో డెబ్యుటంట్ వెబ్‌స్టర్ 57 పరుగులు, స్మిత్ 33 పరుగులతో రాణించారు. ఇవాళ మరో 40 ఓవర్లు ఆట జరిగే ఛాన్స్ ఉంది.

Similar News

News January 19, 2025

శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం

image

సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.

News January 19, 2025

రియల్ హీరోస్..!

image

రెస్టారెంట్లలో నిత్యం వేలాది టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా ఫుడ్‌ను అన్నార్థులకు అందించేందుకు కొన్ని NGOలు ముందుకొస్తున్నాయి. కేవలం బెంగళూరులోనే నిత్యం 296 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అక్కడ ‘హెల్పింగ్ హీరోస్ ఇండియా’ అనే సంస్థ ఫుడ్ సేకరించి పేదలకిస్తోంది. ముంబైలో రాబిన్ హుడ్ ఆర్మీ&ముంబై డబ్బావాలా, కోల్‌కతా వీ కేర్, చెన్నై&హైదరాబాద్‌లో ‘NO FOOD WASTE’ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

News January 19, 2025

శ్రీవారికి రూ.6 కోట్ల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఒకేసారి రూ.6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. SVBC కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విలువైన డీడీలను AEO వెంకయ్య చౌదరికి అందజేశారు. TTDకి చెందిన ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.