News March 4, 2025
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.
Similar News
News January 17, 2026
PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

TG: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.
News January 17, 2026
రాహుల్‌ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.
News January 17, 2026
బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

బంగ్లాదేశ్‌లో హిందువులపై <<18840974>>దారుణాలు<<>> ఆగడం లేదు. రాజ్‌బరి జిల్లాలో రిపోన్ సాహా(30) అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. BNP నేత అబుల్ హషేమ్ కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన రిపోన్‌పైకి కారును ఎక్కించాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, హషేమ్, కారు డ్రైవర్ కమాల్ హొసైన్‌ను అరెస్టు చేశారు.


