News March 4, 2025
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.
Similar News
News March 22, 2025
నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.
News March 22, 2025
ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.
News March 22, 2025
ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్‌తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.