News February 5, 2025

డీప్‌సీక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా

image

ఏఐ రంగంలో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న చైనా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఆ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ అఫైర్స్ సెక్రటరీ స్టెఫానీ తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మొబైల్ పరికరాల్లో డీప్‌సీక్‌ ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ కూడా డీప్‌సీక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News April 19, 2026

విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత!

image

విజయవాడ పటమట సెంటర్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. పట్టుబడిన వారిని అప్పికొండ తేజ, కురిటి సంతోష్ కుమార్, అప్పన్నలుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 19, 2026

AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

image

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్‌లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

News April 19, 2026

పవన్‌ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

image

AP Dy.CM పవన్ కళ్యాణ్‌ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.