News November 5, 2024
ఆస్ట్రేలియాలో కోహ్లీని బీస్ట్ మోడ్‌లో చూస్తాం: మాజీ క్రికెటర్
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తారని మాజీ క్రికెటర్ ఆర్ శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారన్నారు. ‘ఆస్ట్రేలియాలో కోహ్లీని బీస్ట్ మోడ్‌లో చూడబోతున్నాం. ఆయనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం. అక్కడి ప్రతికూల పరిస్థితుల్లో అడేందుకు కోహ్లీ ఎంతగానో ఇష్టపడతారు. మీరు ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ బెస్ట్‌ను చూడబోతున్నారు’ అని చెప్పి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు.
Similar News
News December 11, 2024
టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP: పదో తరగతి పరీక్షల <
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.
News December 11, 2024
రూల్స్ ప్రకారమే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు: కేంద్రం
IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్లపై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌదరీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజర్ రూల్స్-2015 ప్రకారమే Clerkage fee వసూలు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశారని ప్రశ్నిస్తే, ఆ వివరాలు విడిగా తమ వద్ద లేవని బదులిచ్చింది.
News December 11, 2024
మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్
TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.