News December 5, 2024

తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం

image

భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 100 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఆస్ట్రేలియా కాస్త తడబడినా 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో AUS 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Similar News

News December 9, 2025

TODAY HEADLINES

image

* తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు
* వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం: జిష్ణుదేవ్
* చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్
* జనవరిలో దావోస్ పర్యటనకు CM CBN
* 25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN
* వందేమాతరం ఒక మంత్రం: PM
* ప్లానింగ్ లేకపోవడంతోనే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్
* జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

News December 9, 2025

సంజూకు మళ్లీ నిరాశేనా!

image

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్

News December 9, 2025

సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే: CM

image

AP: ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బ‌స్టాండ్లు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌తను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.