News December 5, 2024

తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం

image

భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 100 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఆస్ట్రేలియా కాస్త తడబడినా 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో AUS 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Similar News

News July 9, 2025

వైభవంగా భద్రకాళి శాకంబరీ మహోత్సవాలు

image

భద్రకాళి దేవస్థాంలో శాకంభరీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటితో ఉత్సవాలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం ముద్రాక్రమం, సాయంత్రం జ్వాలామాలినీక్రమం అలంకరణలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రాతః కాల దర్శనాలకు అనుమతించారు.

News July 9, 2025

ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

image

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

News July 9, 2025

‘మెగా 157’: పోలీసులుగా చిరు, వెంకీ?

image

చిరంజీవి-నయనతార కాంబోలో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మెగా 157’లో తన క్యామియో ఉంటుందని <<16974411>>వెంకటేశ్<<>> చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని టీటౌన్‌లో ప్రచారం మొదలైంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.