News November 10, 2024

ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.

Similar News

News January 30, 2026

పార్టీలకు ఇచ్చే భూమి 50 సెంట్లకు పెంపు

image

AP: నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు లీజుకు ఇచ్చే భూమి విషయంలో ప్రభుత్వం కీలక సవరణ చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇచ్చే భూమిని 30 సెంట్ల నుంచి 50 సెంట్లకు పెంచింది. ఈ భూమిని లీజుకు ఇచ్చినందుకు పార్టీల నుంచి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి జీవో 575లో పాయింట్ 1, 3లను సవరిస్తూ రెవెన్యూ శాఖ జీవో 62ను విడుదల చేసింది.

News January 30, 2026

నవగ్రహాలు – నవరత్నాలు: ఏ గ్రహానికి ఏ రత్నం?

image

ఆదిత్యుడు – కెంపు
చంద్రుడు – ముత్యం
అంగారకుడు – ఎర్రని పగడం
బుధుడు – పచ్చ
గురు – పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు – గోమేధుకం
కేతువు – వైడూర్యం

News January 30, 2026

రాజీకి ఏ విధానం అనుసరించారు: హైకోర్టు

image

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని TTD EOను HC ఆదేశించింది. రాజీకి అథారిటీ ఎవరు? ఏ విధానం అనుసరించారు? టీటీడీ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై వచ్చిన అప్పీల్‌తో పాటు సుమోటో పిటిషన్‌ను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును Feb 5కు వాయిదా వేసింది.