News February 28, 2025
AUSvsAFG: ఆసీస్ టార్గెట్ 274 రన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు, ఎల్లిస్, మ్యాక్సీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారూలు 274 రన్స్ చేయాల్సి ఉంది. ఈ వన్డేలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.
Similar News
News November 3, 2025
ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.
News November 3, 2025
ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.
News November 3, 2025
₹లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్.. ప్రారంభించిన మోదీ

టెక్ రెవల్యూషన్‌కు భారత్ సిద్ధంగా ఉందని PM మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ESTIC-2025 కాంక్లేవ్‌ను ప్రారంభించారు. ₹లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను లాంచ్ చేశారు. ‘ఈ ₹లక్ష కోట్లు మీకోసమే. మీ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉద్దేశించినవి. ప్రైవేటు సెక్టార్‌లోనూ రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.


