News February 28, 2025
AUSvsAFG: ఆసీస్ టార్గెట్ 274 రన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు, ఎల్లిస్, మ్యాక్సీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారూలు 274 రన్స్ చేయాల్సి ఉంది. ఈ వన్డేలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.
Similar News
News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News March 23, 2025
నేడు, రేపు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వరకు, అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు రెండు ద్రోణుల కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
News March 23, 2025
ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రి

TG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్, మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 600 ప్రొఫెసర్, 2900 అసిస్టెంట్ ప్రొఫెసర్, 332 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 2,077 ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని, త్వరలో 195 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.