News April 25, 2024

ఈ పేటకు ఎవరు మేస్త్రీ?

image

పల్నాడు(D) చిలకలూరిపేట రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ 5సార్లు టీడీపీ, 3సార్లు కాంగ్రెస్, స్వతంత్రులు రెండుసార్లు, వైసీపీ ఒకసారి గెలిచాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన విడదల రజనీ మంత్రి అయ్యారు. ఈసారి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని వైసీపీ ఇక్కడ పోటీకి దింపింది. గతంలో మూడు సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి సమరానికి సై అంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. tsbie అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

పడవ బోల్తా.. 33 మంది దుర్మరణం

image

ఎర్రసముద్రంలో పడవ బోల్తా పడి 33 మంది చనిపోయారు. వీరిని ఇథియోపియా వలసదారులుగా గుర్తించారు. యెమెన్ నుంచి ఇథియోపియాకు 77 మందితో బయల్దేరిన పడవ జిబౌటీ తీరం సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న తీర రక్షక సిబ్బంది 20 మందిని రక్షించారు. మరికొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ఈసారి ‘పెద్ద సారీ’

image

తప్పుదోవపట్టించేలా యాడ్స్ ప్రసారం చేయడంపై పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ మరోసారి క్షమాపణలు కోరుతూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఇటీవల పేపర్లో చిన్నగా క్షమాపణ ప్రకటన ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు, యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా పతంజలి బేషరతు క్షమాపణలు కోరుతూ పెద్దగా మరోసారి పేపర్లలో ప్రకటన ప్రింట్ చేయించింది.

News April 25, 2024

జీరో షాడో డే అంటే ఏంటి?

image

బెంగళూరులో ఇవాళ ‘జీరో షాడో డే’. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు 6 నిమిషాల పాటు నీడ మాయం కానుంది. కాగా సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. సూర్యుడు +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

News April 25, 2024

నటుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్

image

హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లిపీటలెక్కారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2019లో విడుదలైన ‘మనోహరం’ సినిమా అపర్ణకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో దీపక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాజాగా పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.

News April 25, 2024

స్ట్రాంగ్ రూమ్ భద్రతా ప్రమాణాలేంటి? 1/2

image

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో EC భద్రపరుస్తుంది. అయితే స్ట్రాంగ్ రూమ్‌‌ ఏర్పాటులో కొన్ని భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
➣స్ట్రాంగ్ రూమ్‌కు ఒకటే తలుపు ఉండాలి
➣ప్రవేశ ద్వారం మినహా వేరే మార్గంలో లోనికి వెళ్లేందుకు ఆస్కారం ఉండకూడదు.
➣అగ్ని ప్రమాదం సంభవించినా గోడలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు ఉంటాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

మూడంచెల భద్రతలో స్ట్రాంగ్ రూమ్..2/2

image

➢ డబుల్ లాక్ సిస్టమ్ కలిగి ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు సీఏపీఎఫ్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు.
➢సీఏపీఎఫ్ గార్డులు, పోలీసులు, జిల్లా కార్యనిర్వాహక గార్డులతో చెందిన దళాలతో మూడంచెల భద్రత ఉంటుంది
➢విద్యుత్ శాఖ సహకారంతో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చేస్తారు. జనరేటర్ సైతం అందుబాటులో ఉంచుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

డిపాజిట్ దక్కని వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు!

image

1952 ఎన్నికల్లో విశాఖ(D) పరవాడలో ఉన్న 60,780 ఓట్లలో 25,511 మాత్రమే పోలయ్యాయి. ఇందులో వీరభద్రం(CPI)కి అత్యధికంగా 7,064 ఓట్లు వచ్చాయి. అప్పటి రూల్ ప్రకారం డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో 3వ వంతు.. అంటే 8,504 ఓట్లు రావాలి. అయితే ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారే విజేత అన్న కమ్యూనిస్టుల వాదనతో వీరభద్రంను MLAగా EC ప్రకటించింది. ఆ తర్వాత డిపాజిట్ దక్కేందుకు 6వ వంతు ఓట్లు రావాలని రూల్ మార్చింది.

News April 25, 2024

BREAKING: టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <>ఆన్‌లైన్‌లో<<>> విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ.ఒంటి గంటకు విడుదల చేయనుంది.