News April 25, 2024

BREAKING: టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <>ఆన్‌లైన్‌లో<<>> విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ.ఒంటి గంటకు విడుదల చేయనుంది.

Similar News

News December 14, 2025

హైదరాబాద్‌లో మెస్సీ.. PHOTO GALLERY

image

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.

News December 14, 2025

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇవాళ ప్రెస్‌మీట్‌లో మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీ రోల్‌లో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘రాజాసాబ్(JAN 9)’, శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి(JAN 14)’ కూడా ఉన్నాయి.

News December 14, 2025

అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

image

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.