India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అధికారులను మార్చిందని దుయ్యబట్టారు.
గాయం కారణంగా టోర్నీకి దూరమైన మిచెల్ మార్ష్ స్థానాన్ని భర్తీ చేసేపనిలో ఢిల్లీ క్యాపిటల్స్ పడింది. అతడి స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు రస్సీ వాండర్ డస్సెన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. IPL 2024 మినీ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. ఇప్పుడు అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో కొనుగోలు చేసినట్లు టాక్. కాగా డస్సెన్ గత PSLలో 7 మ్యాచ్‌ల్లోనే 364 రన్స్ బాది సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచారు.
TG: తమను రాష్ట్రంలో ప్రజలు రిజెక్ట్ చేయలేదని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్లు వచ్చాయని తెలిపారు. కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మూడు కోట్ల ఓట్లలో తమ పార్టీకి కోటికి పైగా ఓట్లు పడ్డాయన్నారు. అనుకోకుండా జరిగిన పరిణామంలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చిందన్నారు. అధికారం ఇచ్చినపుడు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
TG: తాను ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకమని చాలా మంది అనుకున్నారని, కానీ తానెప్పుడూ అలా వ్యవహరించలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మనుషుల మధ్య గోడలు కట్టడం తెలివైన పని కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన హయాంలో ఏ ప్రాంతం వారైనా బాధపడే పరిస్థితి తాను తీసుకురానివ్వలేదని తెలిపారు. పదేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్రాన్ని పాలించామన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఆ మూవీకి తలైవా ఏకంగా రూ.260 నుంచి రూ.280కోట్ల వరకూ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ నిలుస్తారు. ఇటీవల వచ్చిన కూలీ టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ 2025లో విడుదలవనుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టైలిష్ లుక్‌లో మెరిశారు. హాఫ్ షర్ట్‌లో మరింత యంగ్‌గా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రోహిత్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా రోహిత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు బాదారు. రోహిత్ రాణిస్తున్నా ముంబై జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. 8 మ్యాచ్‌లు ఆడి మూడింట్లోనే గెలిచింది.
TG: IPS పదవికి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తే తాము అండగా నిలబడినట్లు CM రేవంత్ వెల్లడించారు. ‘దొరల పెత్తనం సహించలేక రాజీనామా చేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్‌లోకి రావొచ్చు కదా? దొరల పెత్తనమని చెప్పి.. మళ్లీ BRS పార్టీలోనే చేరారు. TSPSC ఛైర్మన్‌గా నియమించాలని అనుకున్నాం. ఆయన తిరస్కరించారు. IPSగా ఆయన ఉండుంటే.. డీజీపీని చేసేవాళ్లం’ అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తనను తిట్టడానికేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు వారి గురించి ఆలోచించకుండా శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ 5 నెలలు సమయం వృథా చేసిందని ఆరోపించారు. ప్రజలను గాలికొదిలి, హామీలను పట్టించుకోకుండా ఊదరగొడుతున్న కాంగ్రెస్‌పై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు.
TG: తన ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కొందరు చెప్పారని అది సాధ్యమేనా అని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో లేనప్పుడు నామరూపాలు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. అదో వికృతమైన ఆలోచన అని దుయ్యబట్టారు. ఎవరికైనా టైమ్ వస్తుందన్నారు. ప్రజల ఆలోచన సరళిని మార్చినప్పుడు ఫలితం ఇలా ఉంటుందని తెలిపారు. కృత్రిమంగా, వికృతంగా చేసే ఆరోపణలు చరిత్రలో ఎప్పుడూ సక్సెస్ కావన్నారు.
TG: కేసీఆర్ హయాంలో పాలమూరు గడ్డకు చాలా అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లిలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో మాట్లాడిన ఆయన.. ‘కరీంనగర్‌లో ఓటమి భయంతో కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి జిల్లాకు అన్యాయం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కరవు జిల్లాను కనీసం పట్టించుకోలేదు’ అని ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.