News April 24, 2024

దొరల పెత్తనమని.. బీఆర్ఎస్‌లోకే వెళ్లారు: రేవంత్

image

TG: IPS పదవికి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తే తాము అండగా నిలబడినట్లు CM రేవంత్ వెల్లడించారు. ‘దొరల పెత్తనం సహించలేక రాజీనామా చేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్‌లోకి రావొచ్చు కదా? దొరల పెత్తనమని చెప్పి.. మళ్లీ BRS పార్టీలోనే చేరారు. TSPSC ఛైర్మన్‌గా నియమించాలని అనుకున్నాం. ఆయన తిరస్కరించారు. IPSగా ఆయన ఉండుంటే.. డీజీపీని చేసేవాళ్లం’ అని తెలిపారు.

Similar News

News January 21, 2026

రేపు ఎంపీలతో జగన్ భేటీ

image

AP: వైసీపీ అధినేత జగన్ రేపు తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు జగన్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

News January 21, 2026

మేడారం.. నేడు ‘మండమెలిగే’ పండుగ

image

TG: మేడారం జాతరలో ‘మండమెలిగే’ ఘట్టం జరగనుంది. గ్రామంలోని సమ్మక్క ఆలయాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కడతారు. దీంతో ఇవాళ రాత్రి దర్శనాలు నిలిపివేశారు. పూర్వం అగ్ని ప్రమాదాలతో దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతరకు వారం ముందు కొత్త కొమ్మలతో శుద్ధి చేసి పునర్నిర్మించేవారు. దీంతో ‘మండమెలిగే’ అని పేరు వచ్చింది.

News January 21, 2026

భారత్ నుంచి వన్‌ప్లస్ ఔట్ అనే వార్తలపై క్లారిటీ

image

భారత్‌లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న వార్తలను మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ ఖండించింది. అవి ఫేక్ న్యూస్ అని, రూమర్లను నమ్మొద్దని చెప్పింది. ఇండియన్ మార్కెట్‌లో తమ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 2024లో సేల్స్‌ 20% పతనం, రిటైలర్ మార్జిన్స్ తగ్గుదల, లేఆఫ్స్ కారణంగా భారత్‌లో అన్ని రకాల సేవలను వన్‌ప్లస్ నిలిపివేయనుందనే రూమర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.