India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ రూపొందించనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశముందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ <<13098974>>వ్యాఖ్యలపై<<>> ఈసీకి హస్తం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని, చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తెచ్చేలా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది. మొత్తంగా 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. విపక్ష పార్టీపై ఆయన తప్పుడు నిందలు వేశారని తెలిపింది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 23, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:40
సూర్యోదయం: ఉదయం గం.5:55
జొహర్: మధ్యాహ్నం గం.12:14
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:34
ఇష: రాత్రి గం.07.49
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఏప్రిల్ 23, మంగళవారం
శు.పౌర్ణమి: ఉదయం 5:18 గంటలకు
చిత్త: రా.10:32 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.8:20 నుంచి 9.10 వరకు
దుర్ముహూర్తం: రా.10.56 నుంచి 11.42 వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 4:50 నుంచి ఉ.6:36 వరకు
* ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. 86.69 శాతం ఉత్తీర్ణత
* పులివెందులలో సీఎం జగన్ తరఫున నామినేషన్ దాఖలు
* TG: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే: రేవంత్
* బీఆర్ఎస్‌కు 8-10 ఎంపీ సీట్లు: కేటీఆర్
* సూరత్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ముకేశ్ ఏకగ్రీవంగా ఎన్నిక
* ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ రికార్డు
MIతో మ్యాచ్‌లో RR 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. జైస్వాల్ సెంచరీ(104*)తో అదరగొట్టగా, జోస్ బట్లర్ 35, సంజూ శాంసన్ 38* రన్స్ చేశారు. పియూష్ చావ్లా ఒక వికెట్ తీయగా, మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. MI బ్యాటర్లలో తిలక్(65), వధేరా(49) మినహా అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. RR బౌలర్లలో సందీప్ 5, బౌల్ట్ 2, అవేశ్, చాహల్ చెరో వికెట్ తీశారు.
MIతో జరిగిన మ్యాచ్‌లో RR ప్లేయర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగారు. 59 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో కెరీర్‌లో రెండో ఐపీఎల్ శతకాన్ని బాదారు. ఈ సీజన్‌లో ఫామ్ లేక సతమతమవుతోన్న జైస్వాల్.. తిరిగి తన మార్క్ షాట్లతో అదరగొట్టారు.
జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. రాజౌరీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ ఉద్యోగి మరణించారు. మసీదు నుంచి బయటకు వచ్చిన వెల్ఫేర్ ఉద్యోగి రజాక్‌పై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.
‘నెస్లే’ పిల్లల ఫుడ్ ప్రొడక్టుల్లో అదనపు షుగర్ ఉంటోందని వస్తున్న వార్తలతో పేరెంట్స్‌లో అయోమయం నెలకొంది. అయితే.. షుగర్‌కు అలవాటుపడిన పిల్లలు అన్నం, కూరగాయలు తినడానికి చాలా కష్టపడుతుంటారని ముంబైలో డయాబెటిస్ సెంటర్‌ను నడిపిస్తున్న డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపారు. వారు హైపర్ అగ్రేసివ్‌గా మారతారని, వారిలో చికాకు పెరుగుతుందని అన్నారు. అందుకే రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ షుగర్స్ ఇవ్వొద్దన్నారు.
Sorry, no posts matched your criteria.