News April 24, 2024
‘టిల్లు క్యూబ్’ సినిమాకు ‘మ్యాడ్’ డైరెక్టర్?

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ రూపొందించనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశముందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
Similar News
News December 8, 2025
INDIGO… NAIDU MUST GO: అంబటి

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
News December 8, 2025
‘నీ భార్యను ఇండియాకు పంపేయ్’.. JD వాన్స్‌పై నెటిజన్ల ఫైర్

వలసలపై US ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగతనం చేయడమేనని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది విదేశీయులపై ద్వేషమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె ఫ్యామిలీ, మీ పిల్లలను ఇండియాకు పంపేయండి’ అని మండిపడుతున్నారు. హిందువైన తన భార్య <<18155411>>క్రైస్తవం<<>>లోకి మారే ఛాన్స్ ఉందని ఇటీవల వాన్స్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.
News December 8, 2025
NCDCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<


