India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది. సీసీ కెమెరాలను పరిశీలించగా.. సదరు మహిళతో మాట్లాడిన వారిద్దరు, అనంతరం ఆమెను బలవంతంగా స్థానిక దుకాణం సెల్లార్‌లోకి లాక్కెళ్లినట్లుగా తేలింది. ఆ సమయంలోనే మహిళను రేప్ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
IPL: నిన్న KKRతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫుల్ టాస్ బంతికి ఔట్ కావడం ఐపీఎల్ రూల్స్ ప్రకారం కరెక్టేనని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. బంతి విరాట్ నడుము కంటే ఎక్కువ హైట్ వచ్చింది నిజమేనని, అయితే కోహ్లీ క్రీజ్ దాటడంతో అతడిని ఔట్‌గా ప్రకటించారని పేర్కొంది. కోహ్లీ క్రీజ్ దాటి ఉండకపోతే బంతి నడుము కంటే తక్కువ ఎత్తుకు వచ్చేదని తెలిపింది. అయితే అది నోబాల్‌గా ప్రకటించకపోవడంతో విరాట్ అంపైర్లపై కోప్పడ్డారు.
దేశవ్యాప్తంగా IIITలు, NITలలో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్-2 ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారు. jeemain.nta.ac.in లేదా ntaresults.nic.in వెబ్‌సైట్‌లో స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు.
TG: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేస్తోంది. 60వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు 60 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. మే మొదటి వారంలో ఆ బలగాలు రానున్నాయి. ఒక్కో కంపెనీలో 70-80 మంది ఉండే సిబ్బందిని.. అంతర్గత చెక్‌పోస్టులు, సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నారు.
TG: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ఈనెల 16నే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా పడింది. మ.2 గం.కు వాదనలు ప్రారంభం కానున్నాయి. అటు కవిత ఈడీ, సీబీఐ జుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
AP: కృష్ణా(D) మచిలీపట్నంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. 1983 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. మరో ఆనవాయితీ ఏంటంటే.. ఇక్కడ గెలిచి మంత్రి అయిన వారు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడం. 1989లో కృష్ణమూర్తి(INC), 1999లో నరసింహారావు(TDP), 2014లో కొల్లురవీంద్ర గెలుపొందగా.. వీరు ఆ తర్వాత ఓడిపోయారు. మరి ఈసారి ఈ సంప్రదాయం కొనసాగుతుందో లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: రాజకీయ నేతలు పార్టీలు మారడం కామన్ అయిపోయింది. అయితే చరిత్ర తిరగేసి 1970వ దశకంలో జరిగిన ఫిరాయింపులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇందిరా కాంగ్రెస్, పాత కాంగ్రెస్ మధ్య జంపింగ్‌లు విపరీతంగా జరిగాయి. ఉమ్మడి APలో 1978లో ఇందిరా కాంగ్రెస్ 175 చోట్ల గెలిస్తే 1982నాటికి ఆ పార్టీ బలం 250కి చేరింది. 75 మంది కండువా మార్చారు. అంతేకాదు నలుగురు CMలు(చెన్నారెడ్డి, అంజయ్య, వెంకట్రాం, కోట్ల) మారారు.
<<-se>>#ELECTIONS2024<<>>
AP పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. bse.ap.gov.in సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
TG: రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈక్రమంలోనే కొంతమంది తమ అభిమాన నేత ఫొటోలను పెళ్లి పత్రికపై ముద్రించి ప్రచారం చేస్తున్నారు. మెదక్(D) మహ్మద్‌నగర్‌కు చెందిన సురేశ్ నాయక్ తన తమ్ముడి పెళ్లి పత్రికపై BJP MP అభ్యర్థి రఘునందన్ ఫొటో ముద్రించారు. బంధువుల ఓట్లే పెళ్లికి బహుమతి అని రాసుకొచ్చారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌పై కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.