News October 30, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS సంబరాలు

image

TG: రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడకుండా అడ్డుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా పబ్లిక్‌ హియరింగ్‌లో పాల్గొని దీనిపై ఈఆర్సీని ఒప్పించగలిగామన్నారు. విజయసూచికగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఇవాళ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

News October 30, 2024

NOV మొదటి వారంలో ‘రాబిన్‌హుడ్’ టీజర్

image

నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. 2 సాంగ్స్, 6 రోజుల టాకీ మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపాయి. హీరోహీరోయిన్లతో డైరెక్టర్ వెంకీ కుడుముల ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశాయి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. NOV మొదటి వారంలో టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

News October 30, 2024

హర్షిత్ రాణాను అందుకే టెస్టులు ఆడించలేదా?

image

KKR బౌలర్ హర్షిత్ రాణా టెస్టులకు ఎంపికైనా రంజీ ట్రోఫీలో ఆడటం వెనుక మాస్టర్ మైండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కివీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆయన ఆడాల్సి ఉంది. కానీ ఆడితే క్యాప్‌డ్ ప్లేయర్ లిస్టులో చేరేవారు. అందుకే టెస్టులకు బదులు రంజీల్లో ఆడించారు. ఎల్లుండి ఆయన పేరును రిటెన్షన్ లిస్టులో పంపుతారు. ఆ మరుసటి రోజు ఆయన మూడో టెస్టు ఆడతారు. అప్పుడు రూ.12 కోట్లకు బదులు రూ.4 కోట్లకే KKR దక్కించుకోనుంది.

News October 30, 2024

అత్యధిక మరణాల్ని కలిగిస్తున్న అంటువ్యాధి క్షయ: WHO

image

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కొవిడ్-19 స్థానంలో క్షయ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. గత ఏడాది కొత్తగా 82 లక్షలమంది క్షయ బారిన పడ్డారని పేర్కొంది. ‘టీబీని సమూలంగా అంతం చేయడం అంత సులువు కాదు. ఏటా ఆ వ్యాధికి ఎంతోమంది పేద దేశాల ప్రజలు బలవుతున్నారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలి’ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పష్టం చేశారు.

News October 30, 2024

సరిహద్దుల్లో నక్కిన 50 మంది ఉగ్రవాదులు

image

భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. వారిని అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు ఇండియాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.

News October 30, 2024

స్మృతి మంధాన అరుదైన రికార్డు

image

న్యూజిలాండ్ మహిళలతో మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఓపెనర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(8) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మిథాలీ రాజ్(7), హర్మన్ ప్రీత్ కౌర్(6) ఉన్నారు. ఓవరాల్‌గా వన్డేల్లో లానింగ్(ఆసీస్) 15 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా 3 వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

News October 30, 2024

English Learning: Antonyms

image

✒ Awkward× Adroit, clever
✒ Barbarous× Civilized
✒ Bleak× Bright, Pleasant
✒ Bewitching× Repulsive, Repugnant
✒ Baroque× Plain, unadorned
✒ Brittle× Tough, Enduring
✒ Barrier× Link, Assistance
✒ Baffle× Facilitate, Clarify
✒ Bustle× Slowness, Quiet

News October 30, 2024

MYSTERY: గాల్లోనే హైజాక్.. డబ్బుతో మాయం

image

అమెరికా చరిత్రలో నేటికీ పరిష్కృతం కాని మిస్టరీ ఇది. 1971, నవంబరు 24న నార్త్‌వెస్ట్ ఓరియెంట్ విమానంలో డాన్ కూపర్ అనే ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను పిలిచి సూట్‌కేస్‌లో ఉన్న బాంబ్ చూపించాడు. 2 లక్షల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. సియాటెల్‌లో ప్రయాణికుల్ని బయటికి వదిలేసి డబ్బులు తీసుకుని, నెవాడా వెళ్లాలని పైలట్లకు సూచించాడు. నెవాడా వెళ్లేసరికి డబ్బుతో మాయమయ్యాడు. అతడెవరన్నది నేటికీ అంతుచిక్కలేదు.

News October 30, 2024

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తి

image

తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంట దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల భారత్‌, చైనా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. గాల్వాన్‌ లోయలో దళాల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా అనేక కమాండర్ స్థాయి చర్చల అనంతరం సరిహద్దుల్లో శాంతికి 2 దేశాలు అంగీకారం తెలిపాయి.

News October 30, 2024

సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం

image

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యం: కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. ఆ బిడ్డ గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు తండ్రికి నిజమైన ఆనందం వస్తుంది.