News October 30, 2024
హర్షిత్ రాణాను అందుకే టెస్టులు ఆడించలేదా?
KKR బౌలర్ హర్షిత్ రాణా టెస్టులకు ఎంపికైనా రంజీ ట్రోఫీలో ఆడటం వెనుక మాస్టర్ మైండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కివీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆయన ఆడాల్సి ఉంది. కానీ ఆడితే క్యాప్‌డ్ ప్లేయర్ లిస్టులో చేరేవారు. అందుకే టెస్టులకు బదులు రంజీల్లో ఆడించారు. ఎల్లుండి ఆయన పేరును రిటెన్షన్ లిస్టులో పంపుతారు. ఆ మరుసటి రోజు ఆయన మూడో టెస్టు ఆడతారు. అప్పుడు రూ.12 కోట్లకు బదులు రూ.4 కోట్లకే KKR దక్కించుకోనుంది.
Similar News
News November 11, 2024
తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
* GHMC కమిషనర్ -ఇలంబరితి
* టూరిజం, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి -స్మిత
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ -సృజన
* ఇంటర్ బోర్డు కార్యదర్శి -కృష్ణ ఆదిత్య
* BC సంక్షేమ శాఖ కార్యదర్శి -ఇ.శ్రీధర్
* మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి -అనితా రామచంద్రన్
* రవాణా శాఖ కమిషనర్ -సురేంద్ర మోహన్
* ఎక్సైజ్ శాఖ డైరెక్టర్- హరికిరణ్
* ట్రాన్స్ కో CMD-కృష్ణ భాస్కర్
News November 11, 2024
అక్షయ్ ఫ్యాన్స్ పేరిట ట్రోలింగ్.. ప్రియాంకా చతుర్వేది కౌంటర్
BJPపై శివసేన UBT MP ప్రియాంకా చతుర్వేది పరోక్షంగా విమర్శలు సంధించారు. కాంగ్రెస్ ప్రచారంలో BJPపై నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ చేసిన విమర్శల్ని ప్రియాంక సమర్థించారు. దీంతో నటుడు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ పేజీ తనను విమర్శిస్తూ పోస్టులు పెట్టిందని ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులు, హ్యాష్‌ట్యాగులు ఎక్కడి నుంచి వస్తున్నది సులభంగా అర్థం చేసుకోవచ్చంటూ BJPని ఆమె పరోక్షంగా విమర్శించారు.
News November 11, 2024
వయనాడ్‌లో మైకులు బంద్.. 13న ఉపఎన్నిక
వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో పార్టీల ప్రచార పర్వానికి నేటి సాయంత్రంతో తెరపడింది. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజు UDF అభ్యర్థి, సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ సుల్తాన్ బతెరిలో ప్రచారం చేశారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రియాంకకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అటు LDF నుంచి సత్యం మోకెరి, NDA నుంచి నవ్య హరిదాస్ బరిలో ఉన్నారు.