India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీడీ న్యూస్ లోగో కలర్ మారడం వివాదాస్పదమైంది. గతంలో రూబీ రెడ్ రంగులో ఉన్న లోగో ఇటీవల కాషాయ రంగులోకి మారింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. లోగో లుక్ మెరుగుపర్చేందుకే రంగు మార్చామని డీడీ న్యూస్ ఇచ్చిన వివరణను తోసిపుచ్చుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే రంగు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ప్రసార భారతి ప్రచార భారతిగా మారిందని TMC ఎంపీ జవహార్ సిర్కార్ విమర్శించారు.
సీఎస్కే సీనియర్ ఆటగాడు ధోనీలో పరుగుల ఆకలి తగ్గలేదని సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ వ్యాఖ్యానించారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్‌డీ 9 బంతుల్లోనే 28 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘42 ఏళ్ల వయస్సులో, అదీ ఏడాదంతా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా సరాసరి గ్రౌండ్‌లో దిగి అలా ఆడటం చిన్న విషయం కాదు. ఆయనకింకా పరుగుల ఆకలి తగ్గలేదు. చాలా ఫిట్‌గా, ఆటపై మక్కువతో కనిపిస్తున్నారు’ అని మూడీ అభిప్రాయపడ్డారు.
TG: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.
2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో SI సస్పెండ్ అయ్యారు. బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు రాహిల్ కారు ఢీకొట్టగా ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో అప్పుడు జూబ్లీహిల్స్ SIగా ఉన్న చంద్రశేఖర్‌ను తాజాగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాజకీయ నాయకులకు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతలు ముందుగా తమకు సమాచారం అందించాలని, భద్రతతోనే క్యాంపెయినింగ్ నిర్వహించాలని నేతలకు స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో పురుగు మందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్ ఆరోపించింది. అందులో ఇథలిన్ ఆక్సైడ్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ఫిష్ మసాలా కొన్నవారు వాటిని వినియోగించవద్దని, వాడుతున్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆ దేశ ఫుడ్ ఏజెన్సీ సూచించింది. ఈ ఆరోపణలపై ఎవరెస్ట్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పాకిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా ఘటనల్లో 87 మంది మరణించినట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. మరో 80 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాలతో 2,715 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.
AP: ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మే మొదటి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఉద్యోగ సంఘాలు కోరాయి. సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వద్దకు ముందురోజు మధ్యాహ్నం చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. పోస్టల్ బ్యాలెట్ నమోదు, జారీ ప్రక్రియపై కొంత మంది అధికారుల్లో అనుమానాలను తొలగించాలని కోరాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. వేసవి ముగిసే వరకు లాయర్లు గౌను ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. వేసవి ముగిసిన వెంటనే గౌను ధరించాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.