India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.
TG: రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్‌ల బీర్లను తాగేశారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. కొన్ని చోట్ల బీర్ల కొరత ఉండగా, దాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ నిన్న సాధారణంగా ఉంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే తమ స్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ అమీరాబ్దొల్లాహియన్ ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ఏమైనా చేస్తే వెంటనే ప్రతిస్పందిస్తామని తేల్చిచెప్పారు. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి అనంతరం రెండింటి మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
AP: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేనాని వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కోరుకొండ బస్టాండ్‌లో సభ ఉంటుందని కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి హాజరుకానున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. టీడీపీీ నేతలతో సమావేశం కానున్నారు.
AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి టీటీడీ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. నిన్న 1.20 లక్షల లడ్డూలను తిరుమల నుంచి ఒంటిమిట్టకు పంపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుంది. ఒంటిమిట్టలో ఏప్రిల్ 22న సా.6.30 గంటల నుంచి శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.
TG: వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త. గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డీఎంఈ పరిధిలోని పలు విభాగాల్లో సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2024 జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది.
<<-se>>#Elections2024<<>>
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ నెల 17న నల్గొండ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నేత జనార్దన్‌రావు మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు. మొబైల్ కోర్టులో హాజరుపర్చగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని, అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10నే ముగియాల్సి ఉండగా, విజ్ఞప్తుల ఆధారంగా ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏవైనా తప్పులు ఉంటే నేడు సరిచేసుకోవచ్చని చెప్పారు. సైట్: schooledu.telangana.gov.in
Sorry, no posts matched your criteria.