News April 19, 2024

మెగా డీఎస్సీపై తొలి సంతకం: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారని ఫైరయ్యారు. తాము పోలీసు ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు అందజేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాయదుర్గం సభలో చంద్రబాబు చెప్పారు.

News April 19, 2024

రాములోరి కళ్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపు

image

TG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాల‌ను కార్గో సేవల ద్వారా TSRTC ఇంటి వద్దకే తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ గడువు ముగియగా తాజాగా ఈ నెల 25వ తేదీ వరకు TSRTC పొడిగించింది. రూ.151కే లభించే రాములోరి కళ్యాణ తలంబ్రాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. tsrtclogistics.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

News April 19, 2024

క్వశ్చన్ పేపర్లతో వైసీపీ, జనసేన ఫైట్

image

AP: వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ వైసీపీ ఒక క్వశ్చన్ పేపర్ ట్వీట్ చేసింది. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్?, CBNతో ఎందుకు కలిశావ్? అని ప్రశ్నలు వేసింది. దీనికి కౌంటర్‌గా జనసేన జగన్ పేరుతో ఓ క్వశ్చన్ పేపర్ విడుదల చేసింది. ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? అని సెటైర్లు వేసింది.

News April 19, 2024

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

News April 19, 2024

షర్మిలకు ఈసీ నోటీసులు

image

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

News April 19, 2024

జాతకం బాగాలేదని నన్ను సినిమా నుంచి తప్పించారు: విద్యా బాలన్

image

తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న వింత సంఘటనలను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా జాతకం బాగా లేదని, దురదృష్టవంతురాలినని చెప్పి ఓ నిర్మాత నన్ను సినిమా నుంచి తొలగించారు. ఓ మూఢవిశ్వాసాలున్న డైరెక్టర్ తన మూవీ విజయం సాధించాలని 42 రోజులు ఒకే షర్ట్ ధరించాడు. చివరికి ఆ చిత్రం పరాజయం పాలైంది. వారి వివరాలు, సినిమా పేరు చెప్పాలనుకోవట్లేదు’ అని పేర్కొన్నారు.

News April 19, 2024

తల్లి ఫొటో ఫ్రేమ్ చూసి ఉద్వేగానికి లోనైన మోదీ

image

మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా ఓ యువకుడి చేతిలోని ఫొటో ఫ్రేమ్ చూశారు. తన తల్లి హీరాబెన్ తనను ఆశీర్వదిస్తున్నట్లు గీసిన ఆ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ యువకుడిని అభినందించారు. అతని పేరు, అడ్రస్ రాసి దానిని తనకు ఇవ్వాలని కోరారు. హీరాబెన్ 100ఏళ్ల వయసులో 2022లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

News April 19, 2024

లక్నోతో మ్యాచ్.. CSKలోకి స్టార్ ప్లేయర్

image

CSKతో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. CSK మిచెల్ స్థానంలో స్టార్ ప్లేయర్ మొయిన్ అలీ, శార్దుల్ స్థానంలో చాహర్‌ను తీసుకుంది.
లక్నో: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (C/WK), దీపక్ హుడా, బదోని, స్టొయినిస్, పూరన్, కృనాల్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్, హెన్రీ.
చెన్నై: రచిన్ రవీంద్ర, గైక్వాడ్ (C), రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, MS ధోనీ (WK), దీపక్ చాహర్, దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, పతిరణ.

News April 19, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మండవ?

image

TG: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ రాత్రికే ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవకు.. సీఎం రేవంత్‌ ఒకప్పుడు సన్నిహితుడు. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్ఠానం ఓకే చెప్పినట్లు టాక్. కాగా ఈ సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

News April 19, 2024

సోనియా కాళ్లే పట్టుకోలేదు.. నువ్వెంత?: కిరణ్‌పై పెద్దిరెడ్డి ఫైర్

image

AP: DCC పదవి కోసం తన కాళ్లు పట్టుకున్నారంటూ మాజీ CM కిరణ్‌ చేసిన <<13079584>>వ్యాఖ్యలపై<<>> మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైరయ్యారు. ‘నేను INCలో ఉన్నప్పుడు సోనియా కాళ్లనే పట్టుకోలేదు.. అలాంటిది ఆయన కాళ్లు పట్టుకుంటానా? పదేళ్ల అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. జగన్‌ను అరెస్టు చేయిస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ CM అయ్యారు’ అని విమర్శించారు.