News April 19, 2024
క్వశ్చన్ పేపర్లతో వైసీపీ, జనసేన ఫైట్
AP: వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ వైసీపీ ఒక క్వశ్చన్ పేపర్ ట్వీట్ చేసింది. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్?, CBNతో ఎందుకు కలిశావ్? అని ప్రశ్నలు వేసింది. దీనికి కౌంటర్‌గా జనసేన జగన్ పేరుతో ఓ క్వశ్చన్ పేపర్ విడుదల చేసింది. ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? అని సెటైర్లు వేసింది.
Similar News
News September 18, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.
News September 18, 2024
మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత
AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.
News September 18, 2024
ట్రంప్‌నకు ఫోన్ చేసి పరామర్శించిన కమల
డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి <<14112153>>హత్యాయత్నం<<>> జరిగిన నేపథ్యంలో ఆయనకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన క్షేమంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల ఘటనను ఆమె ఇప్పటికే ఖండించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా బరిలో దిగుతున్నారు.