News April 19, 2024

సోనియా కాళ్లే పట్టుకోలేదు.. నువ్వెంత?: కిరణ్‌పై పెద్దిరెడ్డి ఫైర్

image

AP: DCC పదవి కోసం తన కాళ్లు పట్టుకున్నారంటూ మాజీ CM కిరణ్‌ చేసిన <<13079584>>వ్యాఖ్యలపై<<>> మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైరయ్యారు. ‘నేను INCలో ఉన్నప్పుడు సోనియా కాళ్లనే పట్టుకోలేదు.. అలాంటిది ఆయన కాళ్లు పట్టుకుంటానా? పదేళ్ల అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. జగన్‌ను అరెస్టు చేయిస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ CM అయ్యారు’ అని విమర్శించారు.

News April 19, 2024

టీమ్ ఇండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్?

image

జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై BCCI సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జులై 6 నుంచి 14 వరకు జింబాబ్వేతో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ జట్టుకు పంత్ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.

News April 19, 2024

ఎడ్‌సెట్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

AP: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌‌కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.1000తో మే 19, రూ.2000తో మే 21 వరకు అప్లై చేసుకోవచ్చు. మే30న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 8న పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/

News April 19, 2024

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

image

TG: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాది బతుకమ్మ చీరలు తయారుచేసిన నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.351 కోట్లు ఉండగా, అందులో రూ.50 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక వెసులుబాటును బట్టి మిగతా మొత్తాన్ని త్వరగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో వేలాది మంది కార్మికులకు ఊరట కలగనుంది.

News April 19, 2024

మరో 25 ఏళ్లు వైసీపీదే అధికారం: జోగి

image

AP: రాష్ట్రంలో మరో 25 ఏళ్లపాటు వైసీపీదే అధికారం అని మంత్రి జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మళ్లీ వైసీపీదే అధికారం. చంద్రబాబు సీఎం కావాలని అనుకోవడం లేదు. ఎమ్మెల్యే అయితే చాలని భావిస్తున్నారు. పవన్ కూడా అదే భావనలో ఉన్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈ నెల 25న మా పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 19, 2024

అక్కడ 6 జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణం ఇదే

image

నాగాలాండ్‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. కానీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ నుండి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఈ ఆరు జిల్లాల ప్రజలను ఓటింగ్‌కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. దీంతో 4 లక్షల ఓటర్లున్న ఈ జిల్లాల్లో ఏ ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

News April 19, 2024

వాట్సాప్‌లో ‘ఈవెంట్స్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ఈవెంట్స్’ పేరుతో మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా కమ్యూనిటీ గ్రూపుల్లోని సభ్యులు ఈవెంట్ క్రియేట్ చేసి ఇతర సభ్యులను ఆహ్వానించవచ్చు. ఆ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేసిన వారికి WhatsApp కాల్స్ ద్వారా సమాచారాన్ని ఇవ్వొచ్చు. ఈవెంట్ క్రియేట్ చేసేటప్పుడు తేదీ, లొకేషన్ వంటి ఇన్ఫో ఎంటర్ చేసుకునే వీలుంటుంది. ఈవెంట్ వివరాల్లో ఏవైనా మార్పులు చేస్తే సభ్యులందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది.

News April 19, 2024

ఒక్కసారే ఎన్నిక జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే!

image

AP: నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కొన్నిచోట్ల ఒక్కసారే ఎన్నికలు జరిగాయి. అవి.. పాచిపెంట, రామతీర్థం, బొద్దాం(విజయనగరం)-1962, హొంజరం-1952(శ్రీకాకుళం), కరప, కోరుకొండ(తూ.గో)-1962, అలంపురం(ప.గో)-1962, విజయవాడ(కృష్ణా)-1952, అమృతలూరు, గుంటూరు, బెల్లంకొండ, పల్నాడు(గుంటూరు)-1952, సిర్వేరు, మిడ్తూరు(కర్నూలు)-1955, యేర్పేడు(చిత్తూరు)-1962 ఉన్నాయి. విజయవాడ 3, గుంటూరు 2 సెగ్మెంట్లుగా మారింది. <<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

ముగిసిన లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్

image

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో సాయంత్రం 5 గంటల వరకు 77.57% ఓటింగ్ నమోదైంది. ఈరోజు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో ఇదే అత్యధికం అని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు రెండో విడత పోలింగ్ ఈనెల 26న జరగనుంది. ఆ రోజున 13 రాష్ట్రాల్లోని 89 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

News April 19, 2024

తల్లి కాబోతోన్న నటి మసాబా గుప్తా

image

తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా వెల్లడించారు. భర్త సత్యదీప్ మిశ్రాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘రెండు చిన్న పాదాలు మా జీవితంలోకి రానున్నాయి. మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి’ అని రాసుకొచ్చారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.