News April 19, 2024

టీమ్ ఇండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్?

image

జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై BCCI సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జులై 6 నుంచి 14 వరకు జింబాబ్వేతో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ జట్టుకు పంత్ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.

Similar News

News September 10, 2024

రూ.500 లాటరీతో రూ.2.5 కోట్లు గెలిచాడు!

image

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బులతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దు అనుకోగా.. భార్య చెప్పడంతో ఇదే చివరిదని రూ.500 పెట్టి కొనుగోలు చేశారు. ఇన్నిరోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతమ్ ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన రూ.2.5 కోట్లు గెలుపొందారు.

News September 10, 2024

ఎన్నికలు న్యాయంగా జరగలేదు: USలో రాహుల్

image

లోక్‌సభ ఎన్నికలు న్యాయంగా జరిగినట్టు తాను విశ్వసించడం లేదని LoP రాహుల్ గాంధీ అమెరికాలో అన్నారు. ‘BJPకి 240 సీట్లలోపు వచ్చుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. వారికి అర్థబలం చాలా ఎక్కువ. వారు కోరుకున్నట్టే EC పనిచేసింది. తన అజెండాకు తగిన విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మోదీకి అవకాశం దొరికింది. బ్యాంకు ఖాతాలు స్తంభించినా కాంగ్రెస్ పోటీ చేసింది. మోదీ ఆలోచనను నాశనం చేసింది’ అని ఆయన అన్నారు.

News September 10, 2024

ఏపీలో రూ.6,882 కోట్ల నష్టం!

image

AP: ప్రాథమిక అంచనా ప్రకారం వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.6,882కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యుమరేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు మొత్తం 46 మంది ప్రజలు, 540 పశువులు మృతిచెందినట్లు గుర్తించింది. 4.90 లక్షల ఎకరాల్లో పంట నష్టం, 5,921kms మేర రోడ్లు ధ్వంసమైనట్లు పేర్కొంది.