India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ ఎన్నికల్లో కూటమి చేతిలో వైసీపీ చిత్తుగా ఓడటం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రాన్ని జగన్ ఇష్టానుసారం దోచుకున్నారు. ఆయన మాటలకు.. పనులకు పొంతన ఉండదు. మద్యనిషేధం పేరుతో ప్రజలను వంచించారు. హోదా తెస్తామని మోసం చేశారు. మాట తప్పే జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా? రాష్ట్ర చరిత్ర మార్చే కీలక సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏను భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
AP: రాజంపేట పార్లమెంటులో ఈసారి పోరు ఆసక్తికరంగా ఉండనుంది. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(YCP) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి BJP తరఫున MPగా పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2009 వరకు ఈ సీటు INCకి కంచుకోట. 11సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. TDP, YCP చెరో రెండు సార్లు, ఓ సారి స్వతంత్ర పార్టీ విజయం సాధించింది.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. ‘టీడీపీకి ఓటేస్తే పసుపుపతి నిద్రలేచి వదల బొమ్మాళి వదల అంటాడు. చంద్రబాబు కత్తిరింపులు మొదలవుతాయి. గోరు ముద్ద రద్దు. విద్యా దీవెన, వసతి దీవెన అమ్మఒడి రద్దు. పేదవాడికి వైద్యం అందకుండా చేస్తుంది ఈ చంద్రముఖి. అక్కాచెల్లెమ్మలకు బతుకులు అతలాకుతలం అవుతాయి. ఫ్యాన్‌కి ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.
AP: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.
AP: ఇవాళ మన్యం(D) సాలూరులో 45.7°C, YSR(D) సింహాద్రిపురంలో 45.6°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 117 మండలాల్లో వడగాలులు వీచాయని పేర్కొంది. రేపు 55 మండలాల్లో తీవ్ర వడగాలులు,197 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 44 మండలాల్లో తీవ్ర వడగాలులు, 165 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మండలాల వివరాల కోసం ఇక్కడ <
రీనా ద్వివేది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్ అయ్యారు. ఎన్నికల విధులకు పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. తాజాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇషా అరోరా అనే అధికారిణి నెట్టింట ట్రెండింగ్‌గా మారారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలింగ్ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె తన ట్రెండీ లుక్‌తో నెటిజన్లను ఆకర్షించారు. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
సివిల్స్ టాపర్స్ మార్కులు వెల్లడయ్యాయి. టాప్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవకు 1099 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్‌కు 1067, మూడో ర్యాంకర్ అనన్య రెడ్డికి 1065, నాలుగో ర్యాంకర్ పీకే సిద్ధార్థ్‌కు 1059, ఐదో ర్యాంకర్ రుహానీకి 1049 మార్కులు వచ్చాయి. సివిల్స్ మెయిన్స్‌కు 1750, ఇంటర్వ్యూకు 275 కలిపి మొత్తం 2025 మార్కులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.
TG: ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. ‘ఒకట్రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులోనూ నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఈడీ కేసులో గతంలోనే శరత్ అప్రూవర్‌గా మారారు. కాగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.
AP: రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించే విజయవాడ ప్రాంతంలోని కీలక నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్, TDP, YCP చెరొకసారి గెలిచాయి. 2019 ఎన్నికల్లో TDP అభ్యర్థి బోండా ఉమపై మల్లాది విష్ణు(YCP) 25 ఓట్ల తేడాతోనే గెలిచారు. ఈసారి విజయవాడ వెస్ట్ MLA వెల్లంపల్లి శ్రీనివాస్‌ని YCP ఇక్కడ పోటీ చేయిస్తోంది. TDP నుంచి ఉమ మరోసారి పోటీకి సై అంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.