News April 19, 2024
కూటమి చేతిలో వైసీపీ చిత్తు: చంద్రబాబు

AP: ఈ ఎన్నికల్లో కూటమి చేతిలో వైసీపీ చిత్తుగా ఓడటం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రాన్ని జగన్ ఇష్టానుసారం దోచుకున్నారు. ఆయన మాటలకు.. పనులకు పొంతన ఉండదు. మద్యనిషేధం పేరుతో ప్రజలను వంచించారు. హోదా తెస్తామని మోసం చేశారు. మాట తప్పే జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా? రాష్ట్ర చరిత్ర మార్చే కీలక సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏను భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News July 10, 2025
భూకంపాలు ఎందుకు వస్తాయంటే?

భూమి ఆకస్మికంగా కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు బలంగా కదిలినప్పుడు భూకంపం వస్తుంది. భూపాతాలు, హిమపాతాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7 దాటితే భవనాలు పేకమేడల్లా కూలుతాయి. రోడ్లు చీలిపోతాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.
News July 10, 2025
PHOTO GALLERY: ‘మెగా PTM’లో CBN, లోకేశ్

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పిల్లలకు సీఎం పాఠాలు చెప్పారు. సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంబంధించి వారు Xలో ఫొటోలు షేర్ చేశారు.
News July 10, 2025
ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.