India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంటార్కిటికాలోని మౌంట్ ఏర్‌బస్ అనే అగ్నిపర్వతం బంగారాన్ని వెదజల్లుతోంది. రోజుకి 80 గ్రాముల బంగారాన్ని పైకి చిమ్ముతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలవడంతోనే ఇలా జరుగుతోందన్నారు. 1972 నుంచి ఇప్పటి వరకు ఈ అగ్ని పర్వతం నుంచి 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలో చేరినట్లు వెల్లడించారు. ఈ వాల్కేనో కింద బంగారు గని కూడా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
నిన్న కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్.. ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.540 పెరిగింది. దీంతో రూ.74,340కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.68,150గా నమోదైంది. అటు సిల్వర్ రేట్లు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.90,000గా ఉంది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొదటి విడతలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొందరు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(BJP) దేశంలోనే సుదీర్ఘకాలం పని చేసిన రోడ్డు, రవాణాశాఖ మంత్రిగా నిలిచారు. ఆయన నాగ్‌పూర్ బరిలో ఉన్నారు. మరో మంత్రి కిరణ్ రిజిజు(BJP) అరుణాచల్ వెస్ట్‌లో పోటీ చేస్తున్నారు. BJP తమిళనాడు చీఫ్ అన్నామలై, TG మాజీ గవర్నర్ తమిళిసై, DMK లీడర్ కనిమొళిపై అందరి దృష్టి నెలకొంది.
ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమేనని అధికారులు చాటి చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మలోగం అనే గ్రామంలో కేవలం ఓకే ఒక మహిళా ఓటరు సోకెలా తయాంగ్ ఉన్నారు. ఆమె ఒక్క ఓటు కోసం EC అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. ఆ బూత్‌కు చేరుకునేందుకు సుమారు 10 మంది అధికారులు 39 కి.మీ కాలినడకన వెళ్లారు. అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఈసీ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
‘లీడర్’కు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. ‘హ్యాపీడేస్’ రీ-రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హ్యాపీ డేస్ సినిమా ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటుంది. దానికి సీక్వెల్ చేద్దామన్నా కథ కుదర్లేదు. ఇక లీడర్ విషయంలోనూ సీక్వెల్ ఆలోచనలున్నాయి. చేస్తే రానాతోనే చేస్తా. కానీ టైం పడుతుంది. సినిమాలో అప్పట్లో రూ.లక్ష కోట్ల అవినీతి కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది’ అని తెలిపారు.
IPLలో అదరగొడుతున్న PBKS బ్యాటర్ అశుతోశ్ టోర్నీకి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి కూడా సరిగా దొరికేది కాదు. అయితే మాజీ క్రికెటర్ అమే కురేసియా అండతో వివిధ టోర్నీల్లో రాణించారు. కానీ కొవిడ్ తర్వాత మళ్లీ రిజర్వ్ బెంచీకే పరిమితమయ్యారు. ఆ సమయంలో డబ్బు కోసం అంపైరింగ్ చేసేవారు. 2023లో ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బంతుల్లో 50 రన్స్ చేసి పాపులర్ అయ్యారు. వేలంలో అతడిని PBKS రూ.20 లక్షలకు దక్కించుకుంది.
AP: విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీచేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ‘నా పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉంది. వాహనాలు, రుణాలు, స్థిరాస్తులు లేవు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక పాల్‌పై ఒంగోలు, మహబూబ్‌నగర్, ఎల్.కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులు ఉన్నాయి. ఆయన డిగ్రీ రెండో ఏడాదిలోనే చదువు ఆపేశారు.
ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అపశృతి జరిగింది. మాథాభాంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్‌రూమ్‌లో ఒక CRPF జవాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎన్నికల పోలింగ్‌కు ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అతడి తలపై గాయాలున్నాయని, జారిపడటం వల్ల మరణించి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. జవాన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ‘టచ్’ రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు అంటుంటే.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్‌లో ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ చెబుతోంది. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. ‘ఇవేం రాజకీయాలు?’ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు రెండు సార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్‌కు ఒకసారి జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.