India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నీ స్థానాలకు నేడే పోలింగ్ జరగనుంది. తమిళనాడు (39), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయా (2) సహా చెరొక స్థానాలు ఉన్న సిక్కిం, నాగాలాండ్, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక యూటీలైన అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరీల భవితవ్యాన్ని కూడా ఓటర్లు నేడు తేల్చనున్నారు. <<-se>>#Elections2024<<>>
TG: రేవంత్ రెడ్డి CM అయ్యాక రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కనబడుతోందని KTR అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ‘లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం అన్యాయమని రాహుల్ అంటాడు. రేవంత్ మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్ట్ అంటాడు. రేవంత్ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోదీ కోసమా? రాహుల్ కోసమా?. మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది BJPకే వెళ్తుంది’ అని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. తమిళనాడు, రాజస్థాన్, UP, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌లలో పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలోనూ ఎన్నికలు జరగనున్నాయి.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం
1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ భూభాగం (ఇప్పటి రష్యా) నుంచి ప్రయోగించారు
నిద్రపోయే ముందు TVలు, ఫోన్‌లు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం పిల్లల నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అసౌకర్యమైన పరిస్థితులు, డే టైమ్‌లో నిద్రపోవడం, నైట్ టెర్రర్స్/స్లీప్‌వాకింగ్ వంటివి కూడా ఇందుకు కారణమని అంటున్నారు. నిద్రతో పాటు చాలా విషయాల్లో పిల్లలు తమ పేరెంట్స్‌ని ఫాలో అవుతారని, కాబట్టి అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు నడుచుకోవాలని సూచిస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుసగా విఫలమవుతున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా కేవలం 10 రన్స్‌కే వెనుదిరిగారు. టోర్నీలో ఇప్పటివరకు పాండ్య 7 మ్యాచ్‌లు ఆడి 141 పరుగులు మాత్రమే చేశారు. అటు బౌలింగ్ కూడా అడపాదడపా వేస్తున్నా వికెట్లు దక్కించుకోవడం లేదు. కాగా కెప్టెన్సీ ఒత్తిడితోనే పాండ్య బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
ఈ IPLలో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నమోదైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ తొలుత తడబడినా తర్వాత బలంగా నిలబడింది. 7 ఓవర్లకే టాప్, మిడిల్ ఆర్డర్లు కూలినా.. శశాంక్ 41(25), అశుతోశ్ 61(28) పోరాడటంతో ముంబైకి విజయం అంత సులువుగా దక్కలేదు. టెయిలెండర్లు సైతం MIని టెన్షన్ పెట్టారు. ఈ సీజన్‌లో ఢిల్లీ, RCB, GT, SRH, RRతో మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఆటను చివరి వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.
తేది: ఏప్రిల్ 19, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున గం.4:43 సూర్యోదయం: ఉదయం గం.5:57 జొహర్: మధ్యాహ్నం గం.12:15 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.48 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఏప్రిల్ 19, శుక్రవారం చైత్రము శు.ఏకాదశి: రాత్రి 08:05 గంటలకు మఖ: మరుసటి రోజు ఉదయం 10:56 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 08:22 నుంచి 09:12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12.31 నుంచి 01.21 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 07:59 నుంచి 09:47 గంటల వరకు
Sorry, no posts matched your criteria.