News April 19, 2024
పిల్లల నిద్ర నాణ్యతకు భంగం కలిగించే అంశాలివే
నిద్రపోయే ముందు TVలు, ఫోన్‌లు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం పిల్లల నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అసౌకర్యమైన పరిస్థితులు, డే టైమ్‌లో నిద్రపోవడం, నైట్ టెర్రర్స్/స్లీప్‌వాకింగ్ వంటివి కూడా ఇందుకు కారణమని అంటున్నారు. నిద్రతో పాటు చాలా విషయాల్లో పిల్లలు తమ పేరెంట్స్‌ని ఫాలో అవుతారని, కాబట్టి అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు నడుచుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News September 17, 2024
ఇవాళ సెలవు.. నవంబర్ 9న వర్కింగ్ డే
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే వర్తిస్తుంది. అయితే వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు సెలవులు వచ్చినందున నవంబర్ 9న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యాసంస్థలు యథాతథంగా నడవనున్నాయి.
News September 17, 2024
రాజీవ్ విగ్రహంపై వివాదం.. నేడు రాష్ట్రంలో BRS ఆందోళనలు
TG: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై BRS మండిపడుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శిస్తున్నారు.
News September 17, 2024
ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.