News April 18, 2024

ఎన్నికల తర్వాత BRS ఉండదు: ఉత్తమ్

image

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 18, 2024

భూసార పరీక్షా కేంద్రాల పునరుద్ధరణ: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలోని 25 భూసార పరీక్షా కేంద్రాలను పునరుద్ధరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 2020-21 తర్వాత ఉపయోగంలో లేని ఆ కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లోపు మట్టి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నేల స్వభావం తెలిస్తే ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన వస్తుందని, వారి సాగు ఖర్చు భారీగా తగ్గుతుందని చెప్పారు.

News April 18, 2024

సునీల్ నరైన్ సంచలన నిర్ణయం?

image

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీ20 WCలో ఆడాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నరైన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా నరైన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నారు. 276 పరుగులతోపాటు 7 వికెట్లు పడగొట్టారు.

News April 18, 2024

PCC కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: మాజీ సీఎం

image

AP: అప్పట్లో పదవి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని మాజీ CM, రాజంపేట BJP MP అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ‘పీసీసీ అధ్యక్ష పదవి కోసం నా కాళ్లావేళ్లా పడ్డారు. నేను పదవి ఇవ్వకపోవడంతో నాపై కసి పెంచుకున్నారు. ఇప్పుడు అక్రమాలను ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబపాలన నుంచి జిల్లాను విముక్తి చేయాలి’ అని ఆయన మండిపడ్డారు.

News April 18, 2024

రేపు తొలి దశ పోలింగ్.. విశేషాలివే!

image

దేశంలో రేపు తొలిదశ పోలింగ్ జరగనుంది. 21 రాష్ట్రాలు/UTల్లోని 102 MP స్థానాలు, అరుణాచల్‌(60), సిక్కిం(92) అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తారు. TN-39, రాజస్థాన్-12, UP-8, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్‌లో 5 చొప్పున, బిహార్-4, బెంగాల్-3, అరుణాచల్, మణిపుర్, మేఘాలయలో 2 చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కోస్థానంలో ఓటింగ్ జరగనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

IPL: పంజాబ్ టార్గెట్ 193 రన్స్

image

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 192/7 స్కోర్ చేసింది. MI బ్యాటర్లలో సూర్య కుమార్ 78, రోహిత్ 36, తిలక్ 34 రన్స్‌తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ 3, సామ్ కరన్ 2 వికెట్లు తీయగా, రబడ ఒక వికెట్ పడగొట్టారు.

News April 18, 2024

రేపు తొలి దశ పోలింగ్.. విశేషాలివే!

image

✒ మొత్తం ఎంపీ స్థానాలు: 102(జనరల్-73, SC-18, ST-11)
✒ పోటీ చేస్తున్న అభ్యర్థులు: 1,625(1,491-M, 134-F)
✒ పోలింగ్ కేంద్రాలు 1.87 లక్షలు
✒ పోలింగ్ సిబ్బంది 18 లక్షలు
✒ ఓటర్లు 16.63 కోట్లు(8.4 కోట్లు-M, 8.2 కోట్లు-F, ఇతరులు 11,371)
✒ తొలిసారి ఓటర్లు 35.67 లక్షలు
✒ 85 ఏళ్ల ఓటర్లు 14.14 లక్షలు, దివ్యాంగులు 13.89 లక్షలు(వీరికి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఉంది)
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

ELECTIONS: వెంకట్రామిరెడ్డి సస్పెండ్

image

AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. YSR జిల్లా బద్వేలులో RTC ఉద్యోగులతో ఆయన భేటీ నిర్వహించారు. YCPకి అనుకూలంగా ప్రచారం చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని వెంకట్రామిరెడ్డిని EC ఆదేశించింది. ఆయన పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

News April 18, 2024

కేసు పెట్టకుండా ఉండేందుకు ఎస్సై లంచం

image

TG: భద్రాచలం ఎస్సై, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.20వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు కానిస్టేబుల్ శంకర్ గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసు లేకుండా చేయడానికి శంకర్ లంచం అడిగారు. సదరు వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్, సీసీ కెమెరా ఆపరేటర్ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News April 18, 2024

23న పవన్ కళ్యాణ్ నామినేషన్

image

AP: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన Xలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని తెలిపింది.