News April 18, 2024
ELECTIONS: వెంకట్రామిరెడ్డి సస్పెండ్
AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. YSR జిల్లా బద్వేలులో RTC ఉద్యోగులతో ఆయన భేటీ నిర్వహించారు. YCPకి అనుకూలంగా ప్రచారం చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని వెంకట్రామిరెడ్డిని EC ఆదేశించింది. ఆయన పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
Similar News
News September 8, 2024
మరో 5 జిల్లాల్లో రేపు సెలవు
APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.
News September 8, 2024
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 8, 2024
ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!
గుజరాత్ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెందడం కలకలం రేపింది. భారీ వర్షాల తరువాత బాధితులకు వచ్చిన తీవ్రమైన జ్వరాన్ని వైద్యులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ సరిహద్దులో ఉండే ఈ తాలూకాలో సమస్య పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.