India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో తొలి ఎన్నికల సమయానికి అక్షరాస్యత 16 శాతమే. దీంతో పార్టీలను సులభంగా గుర్తించడానికి వీలుగా సింబల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ గుర్తులకు రూపమివ్వడానికి చిత్రకారుడు MS సేథిని 1950లో ఎన్నికల కమిటీ నియమించింది. ఆయన 1992 వరకు పెన్సిల్‌తో ఎన్నో వేల గుర్తులను గీశారు. ఇప్పటికీ ఆయన చిత్రాలే కాస్త ఆధునికత సంతరించుకుని ఎన్నికల గుర్తులుగా ఉన్నాయి. కాగా 2000 సంవత్సరంలో సేథి కన్నుమూశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందం సమావేశమైంది. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌లు జరుపుకునేందుకు సపోర్ట్ చేయనున్నట్లు బృందం సభ్యులు చిరంజీవికి తెలిపారు. రెండు ఇండస్ట్రీలు కలిసి పనిచేయడంతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు.
వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో తాను ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డారు. సమయం వెనక్కి వెళ్లగలిగితే మీరు ఏ నిర్ణయాన్ని సరిచేసుకుంటారని అశ్విన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ జవాబిచ్చారు. ‘ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై నేను చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. దీని వల్ల 30-40 రన్స్ ఎక్కువ వచ్చేవి. ప్రపంచకప్ మా చేతుల్లో ఉండేది. దానికి నేను చింతిస్తున్నా’ అని పేర్కొన్నారు.
పార్టీలు, ఇండిపెండెంట్లకు గుర్తులను EC కేటాయిస్తుంది. రిజర్వుడ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్ అని 2 రకాలుంటాయి. EC గుర్తింపు పొందిన పార్టీల(EX: BJP, INC, YCP, TDP, BRS)కు రిజర్వుడ్ గుర్తులుంటాయి. వీటిని ఇతరులకు కేటాయించరు. కొత్త పార్టీలు, స్వతంత్రులు, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీల(EX: JSP, లోక్‌సత్తా)కు ఫ్రీసింబల్స్‌ను కేటాయిస్తుంది. ఆ పార్టీలు గుర్తింపు పొందే వరకు గుర్తుల కోసం అప్లై చేసుకోవాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
కర్ణాటక హుబ్బళ్లిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు. కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహ (24) BVB కాలేజీలో చదువుతోంది. కాలేజీలో సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతడు యువతి మెడపై విచక్షణారహితంగా 9 సార్లు కత్తితో పొడిచి, చంపేశాడు. లవ్ జిహాద్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దేశంలోని 2 ప్రధాన జాతీయ పార్టీలైన INC, BJP 1951 నుంచి ఇప్పటి వరకు 3సార్లు గుర్తులను మార్చుకున్నాయి. కాంగ్రెస్ 1951-1969 వరకు జోడెద్దులు, 1971-77 వరకు ఆవుదూడ(ఇందిరా కాంగ్రెస్-R), 1977 నుంచి హస్తం గుర్తును ఉపయోగిస్తోంది. ఇక భారతీయ జన సంఘ్ 1951-1977 వరకు దీపం, ఆ పార్టీని జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత నాగలి ఎత్తుకున్న రైతు, 1980లో బీజేపీని ఏర్పాటు చేశాక కమలం గుర్తును ఎంచుకుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య సుహాస్ డైరెక్షన్‌లో ప్రియమణి, యామీ గౌతమ్ నటించిన ‘ఆర్టికల్ 370’ సినిమా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ₹20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ₹100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. 2019 FEB 14న పుల్వామా దాడి, ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే క్రమంలో ఎదురైన సంఘటనలపై మూవీ రూపొందింది.
TG: నాగర్ కర్నూల్ ఎంపీగా తాను చరిత్రాత్మక విజయం సాధిస్తానని BRS అభ్యర్థి RS.ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా KCR నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నాగర్ కర్నూల్ ప్రజలకు విశ్వసనీయ సేవకుడిగా ఉంటానని చెప్పారు.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై: రోహిత్, ఇషాన్ (WK), సూర్య, తిలక్, హార్దిక్ (C), టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కొయెట్జీ, బుమ్రా.
పంజాబ్: రూసో, ప్రభ్‌సిమ్రాన్, సామ్ కరన్ (సి), లివింగ్‌స్టోన్, జితేశ్ (WK), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్, రబాడ.
VVPAT అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. దీన్ని EVMకు కనెక్ట్ చేస్తారు. EVMలో ఓటేయగానే.. అభ్యర్థి గుర్తు, పార్టీ పేరు మిషన్‌లోని తెరపై కనిపిస్తాయి. వెంటనే ఆ వివరాలు చిన్నకాగితంలో ప్రింటయ్యి అడుగున ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. కౌంటింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల VVPATలు, EVM ఓట్లను సరిపోల్చుతారు. కాగా మాక్‌పోల్‌లో BJPకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని విపక్షాలు <<13076328>>సుప్రీంను<<>> ఆశ్రయించాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.