India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలో బిహార్‌కు చెందిన రాజా షా సహా మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షా ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత వారం రంజిత్ సింగ్ అనే టూరిస్ట్ గైడ్‌పై ముష్కరులు దాడి చేయగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తేది: ఏప్రిల్ 18, గురువారం ఫజర్: తెల్లవారుజామున గం.4:44 సూర్యోదయం: ఉదయం గం.5:58 జొహర్: మధ్యాహ్నం గం.12:15 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఏప్రిల్ 18, గురువారం చైత్రము శు.దశమి: సాయంత్రం: 05:31 గంటలకు ఆశ్లేష: మరుసటి రోజు ఉదయం 07:56 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 10:02 నుంచి 10:52 గంటల వరకు, తిరిగి ఉదయం 03.00 నుంచి 03.50 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 09:26 నుంచి 11:14 గంటల వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
➣కాంగ్రెస్ ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వచ్చేది: PM
➣AP:జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం: CBN
➣వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్
➣TG:వచ్చే ఇరవై ఏళ్లు రాహులే ప్రధాని: సీఎం రేవంత్
➣ఎన్నికలు పూర్తయ్యాక హామీలు నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
➣ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మిస్తాం: కిషన్ రెడ్డి
➣నేను పార్టీ మారుతా అనే వారిని చెప్పుతో కొడతా: హరీశ్ రావు
➣IPL:గుజరాత్‌పై ఢిల్లీ విజయం
లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.
తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జమ్మూకశ్మీర్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. ఆయన అనంతనాగ్- రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ నెల 2న పార్టీ తెలిపింది. అయితే అనూహ్యంగా ఆజాద్ యూటర్న్ తీసుకుని పోటీ చేయడం లేదని తాజాగా ప్రకటించారు. ఇక్కడ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ పోటీలో ఉన్నారు.
TG: ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న వయనాడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో రేవంత్ ప్రసంగించారు. కాగా రాహుల్ బిజీగా ఉండటం వల్ల దేశంలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలు వయనాడ్‌లో ప్రచారం చేస్తున్నారు. రాహుల్ తరఫున వారందరూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.