News April 18, 2024

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

image

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Similar News

News September 13, 2024

కొందరు పోలీసుల తీరు మారడం లేదు: జనసేన

image

AP: ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారడం లేదని జనసేన ట్వీట్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమంలో వస్తున్నాయంది. గత ప్రభుత్వంలో YCP నేతల దౌర్జన్యాలకు సహకరించిన పోలీసుల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారంది. ఇప్పటికీ కొందరు పోలీసులు అదే తీరును కొనసాగిస్తున్నట్లు వారు వాపోయారని తెలిపింది.

News September 13, 2024

కోహ్లీతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

News September 13, 2024

BREAKING: మరో అల్పపీడనం

image

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.