India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్ ప్రభుత్వం ట్విటర్(X)ను తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ధ్రువీకరించింది. అయితే అప్పటినుంచి పునరుద్ధరించలేదు. దీంతో ట్విటర్ సంస్థ పాక్‌లోని సింధ్ కోర్టుకెళ్లగా.. తిరిగి పునరుద్ధరించాలంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయంటూ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
TG: పథకాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు.
TG: రేపటి నుంచి రాష్ట్రంలో BJP అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. 18న ఈటల(మల్కాజిగిరి), రఘునందన్(మెదక్), మహబూబ్‌నగర్(DK అరుణ) నామినేషన్ వేస్తారు. 19న కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), వినోద్ రావు(ఖమ్మం) నామపత్రాలు సమర్పిస్తారు. 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్, 23న భువనగిరి, 24న పెద్దపల్లి, ఆదిలాబాద్, HYD, వరంగల్, 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేస్తారు.
TG: తాను పార్టీ మారతానని దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతానని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ‘ఏక్‌నాథ్ షిండే నేను కాదు.. సీఎం రేవంతే. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్ అన్ని హామీలు నెరవేర్చి తమకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
AP: వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 9 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వాలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు లోకేశ్.
దేవాలయాలకు ప్రసిద్ధి అయిన మన దేశంలో మృత్యుదేవుడైన యమరాజుకీ ఆలయం ఉంది. ధర్మేశ్వర మహదేవ అని పిలిచే ఈ ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా(D) భర్మోర్‌లో ఉంది. చనిపోయిన వారి ఆత్మలన్నీ ఇక్కడికి చేరుకున్న తర్వాతే ఈ లోకాన్ని విడిచిపెడతాయని స్థానికుల నమ్మకం. చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు భయపడతారట. ఎవరైతే భయం లేకుండా వచ్చి పూజిస్తారో వారికి అకాల మరణం ఉండదని అంటుంటారు. ఇక్కడ చిత్రగుప్తుడికీ ప్రత్యేక గది ఉంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC), ఉమ్మడి పౌరస్మృతి(UCC)ని బెంగాల్‌లో అమలు చేయబోమని అందులో పేర్కొంది. అలాగే పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, ఫ్రీ రేషన్ డెలివరీ తదితర 10 హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చింది.
బెంగళూరుకు చెందిన IISc పరిశోధకులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లను తొలగించే హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేశారు. ఈక్రమంలో వీరి ఆవిష్కరణలను అభినందిస్తూ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా సంచలనాత్మక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ అవి హెడ్‌లైన్స్‌గా మారడం లేదు. ఇలాంటి పరిశోధకులకు గుర్తింపు లభిస్తే చాలా మంది వీరిని అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.
AP: అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన ఘటనపై TDP చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మారరా? మీ బుద్ధి మారదా? మీ వికృత పోకడలను ఇంటికి వెళ్లేముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే మీ నీచమైన చర్యలను మానుకోరా?’ అని YCPపై మండిపడ్డారు. గతంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేయగా దుండగులు దాన్ని ధ్వంసం చేశారు.
ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే నెలలో జరిగే ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షల అడ్మిట్ కార్డులు https://eservices.icai.orgలో అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినా ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు.
Sorry, no posts matched your criteria.