News April 17, 2024
వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు: లోకేశ్
AP: వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 9 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వాలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు లోకేశ్.
Similar News
News September 12, 2024
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్: పంకజ్ జైన్
డిసెంబర్ 2021 తర్వాత తొలిసారి క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. మరికొన్నాళ్లు ఇదే రేటు కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. చమురు ఉత్పత్తిని పెంచాలని OPEC+ దేశాలను ఇండియా కోరడంతోపాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
News September 12, 2024
చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగి..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో ఈ కమ్యూనిస్టు దిగ్గజం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1974లో SFIలో చేరిన సీతారాం, ఏడాది తర్వాత CPM పార్టీలో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
News September 12, 2024
నూడిల్స్ తింటున్నారా?
నూడిల్స్‌ను తినడం మానుకోవడం మంచిదని ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బరా ఓ’నీల్ తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం అందించడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. నూడుల్స్‌లో పోషకాలు శూన్యమని, గోధుమ, సింథటిక్ & MSG, కార్సినోజెనిక్ ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుందని చెప్పారు. నూడుల్స్ తినడం వల్ల జీర్ణాశయంలో మంటగా ఉంటుందని, క్రమంగా రుచిని గుర్తించే స్వభావం తగ్గుతుందన్నారు.