News April 15, 2024

నేడు, రేపు భానుడి భగభగలు

image

TG: రాష్ట్రంలో నిన్నటి పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. మూసాపేటలో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదైంది.

News April 15, 2024

ఆచితూచి వ్యవహరించిన భారత్

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై భారత్ ఆచితూచి వ్యవహరించింది. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గొడవ ఇరాన్‌తో కావడంతో భారత్ అప్రమత్తమైంది. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్ కీలక దేశం కావడం, ఆ ప్రాంతంలోని దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకోవడమే ఇందుకు కారణం. అందుకే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచించింది.

News April 15, 2024

ప్రపంచం ఇంక యుద్ధాలను తట్టుకోలేదు: యూఎన్

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్ పతనం అంచున ఉందని, ఆ ప్రాంతం సహా ప్రపంచ దేశాలు ఇక యుద్ధాలను తట్టుకోలేవన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా ఇరాన్ మిసైల్ దాడులను ఇజ్రాయెల్ దీటుగా ఎదుర్కొంది. అయితే ఎదురుదాడిపై ఆలోచించుకోవాలని ఇజ్రాయెల్‌ను మిత్రదేశాలు హెచ్చరిస్తున్నాయి.

News April 15, 2024

అలాంటి వాటికి దూరంగా ఉండండి: IAS

image

UPSC పరీక్షలకు సన్నద్ధం కావడంపై యూట్యూబ్‌లో వచ్చే వ్లోగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు IAS ఆఫీసర్ అవనీశ్ శరణ్. 18 లేదా అంతకంటే ఎక్కువ గంటలు చదవాలంటూ ఆ వ్లోగ్స్ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. సక్సెస్ కావాలంటే అన్ని గంటలు చదవాల్సిన అవసరం లేదన్నారు. ఆ వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఆయన ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ‘మీరు చెప్పింది నిజమే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News April 15, 2024

పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం: మాయావతి

image

ఎన్నికల వేళ యూపీ మాజీ సీఎం, బీఎస్‌పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఓటింగ్ మెషీన్స్ ట్యాంపర్ కాకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవదు. ధనికులను మరింత సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే బీజేపీ కృషి చేస్తోంది’ అని విమర్శించారు.

News April 15, 2024

ఆ తొమ్మిది సీట్లపై స్పష్టత వచ్చేనా?

image

ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా మహారాష్ట్రలో BJP, శివసేన (ఏక్‌నాథ్ వర్గం), NCP (అజిత్ పవార్ వర్గం) కూటమి సీట్ల పంపకంపై తర్జనభర్జన పడుతోంది. రత్నగిరి-సింధుదుర్గ్, సతారా, ఔరంగాబాద్, నాశిక్, థానే, పాల్‌గఢ్ సహా ముంబైలోని సౌత్, నార్త్ వెస్ట్, నార్త్ సెంట్రల్ సీట్లపైనే ఈ కన్ఫ్యూజన్ అంతా. మే 7న సతారా, రత్నగిరిలో పోలింగ్ జరగనుండగా.. 13న ఔరంగాబాద్‌లో, మిగతా ఆరు చోట్ల 20న పోలింగ్ జరగనుంది. <<-se>>#Elections2024<<>>

News April 15, 2024

స్టాక్ మార్కెట్ల జోరుకు మళ్లీ కళ్లెం?

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల సరికొత్త గరిష్ఠాలను తాకాయన్న సంతోషం మదుపర్లకు ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రూపంలో ఇప్పుడు మార్కెట్లకు మరో సవాల్ ఎదురైంది. ఈ పోరు ముదిరితే అది మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఇదే జరిగితే అతిపెద్ద ఇంధన దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌పై ఆ ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు.

News April 15, 2024

ఉడుకురక్తానికి ఏమైంది?

image

‘కుర్రాళ్లం కదా.. ఉడుకురక్తం’ ఓ సినిమాలో బాగా పేలిన ఈ డైలాగ్ రియాలిటీలో కనిపించడం లేదు. ఎన్నికల వేళ తొలిసారి ఓటు వేసేందుకు రిజిస్టర్ చేసుకున్న యువత దేశంలో 38శాతమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ (67%) ఇందుకు మినహాయింపు. APలో 50% రిజిస్టర్ కాగా మహారాష్ట్ర, UP, బిహార్‌లో 30% కూడా లేరు. ఈ యువతే దేశ భవిత కాబట్టి ఈ పరిస్థితిని మార్చేందుకు నేతలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 15, 2024

వాష్‌రూమ్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారా?

image

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో కొందరు వాష్‌రూమ్‌కు కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు. ఫోన్ చూస్తూ చాలా సమయం అందులోనే గడిపేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి దారితీస్తుంది. తిమ్మిరి సమస్యలు ఎక్కువవుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్‌కు దారితీస్తుంది.

News April 15, 2024

ఫెమినిజంపై నటి షాకింగ్ కామెంట్స్

image

బాలీవుడ్ జంటలు డబ్బు, పేరు కోసమే పెళ్లి చేసుకుంటారన్న బాలీవుడ్ భామ నోరా ఫతేహీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మహిళలు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదనే ధోరణిని విశ్వసించను. ప్రస్తుతం పురుషుల మెంటాలిటీ కూడా మారింది. అందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ సామాజికపరంగా కాదు. స్త్రీవాదం రాడికల్‌గా మారితే సమాజానికి ప్రమాదకరం’ అని అన్నారు.