India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిచెల్ స్టార్క్‌ను KKR ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధర(₹24.75cr)కు కొనుగోలు చేసింది. ఈ సీజన్ తొలి 4 మ్యాచుల్లో అతడు కేవలం 2 వికెట్లే తీశారు. దీంతో అతడిపై వేటు వేయాలని ఫ్యాన్స్ కోరుతుండగా గంభీర్ స్పందించారు. ‘నాలుగు మ్యాచుల్లో రాణించనంత మాత్రాన స్టార్క్ చెత్త బౌలర్ కాదు. ఒక్కసారి ఫామ్ అందుకుంటే ఎంత ప్రమాదకర బౌలరో మనందరికీ తెలుసు. తదుపరి మ్యాచుల్లో రాణిస్తాడనే నమ్మకం మాకుంది’ అని చెప్పారు.
AP: అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తెనాలి సభలో మాట్లాడుతూ.. ‘నేను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు. ఒక వైశ్యుడి దాతృత్వంతో నేను చదువుకున్నా. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకున్నా. ప్రజలు నన్ను మోసం చేశారని నేను వెనక్కి తగ్గలేదు. రాష్ట్రం కోసం మళ్లీ ప్రజల మధ్యకే వచ్చా’ అని పేర్కొన్నారు.
AP: ఎన్నికల వేళ రాజకీయ నాయకులపై ప్రత్యర్థులు రాళ్లు విసరడం కలకలం రేపుతోంది. నిన్న సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడంతో ఆయనకు గాయమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లోనూ ఆగంతకులు రాళ్లు విసిరారు. రాజకీయాల్లో ఇలాంటి విపరీత చర్యలు శ్రేయస్కరం కాదు. రాళ్లు వేయడం మంచి పద్ధతి కాదు. నాయకులపై వ్యతిరేకతను రాళ్లతో కాకుండా ఓట్ల రూపంలో చూపించండి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తును మార్చినవారవుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>
AP:విశాఖలో తనపై రాళ్లు వేసిన ఘటనపై చంద్రబాబు ఫైరయ్యారు. ‘విజయవాడలో CMపై ఎవరో రాయి విసిరారు. ఈ ఘటనను అందరూ ఖండించారు. నేను రాళ్లు వేయించినట్లు కొన్ని పేటీఎం బ్యాచ్ కుక్కలు మొరిగాయి. కోడికత్తి డ్రామా, బాబాయి హత్యను నాపై నెట్టాలని చూశారు. CMపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా.. నిందితులను పట్టుకోలేదు. ఇప్పుడు నాపై రాళ్లు విసిరారు. క్లెమోర్ మైన్స్‌కే నేను భయపడలేదు, ఈ రాళ్లకు భయపడతానా?’ అని ప్రశ్నించారు.
ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరిగా SRH కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పేరు తెచ్చుకున్నారు. స్పిన్ బౌలింగ్‌లో సిక్సులు అంత సులువుగా కొట్టడం వెనుక కారణాల్ని ఆయన క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో వివరించారు. ‘స్వదేశంలో నాకు అద్భుతమైన స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. వారిని ఎదుర్కొనే క్రమంలో మరింత మెరుగయ్యా. గేల్ నా ఫేవరెట్ బ్యాటర్. అందుకే తన జెర్సీ నంబర్‌నే(45) నేను కూడా ధరిస్తుంటాను’ అని స్పష్టం చేశారు.
AP: వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని, YCP ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోవడం ఖాయమని బాలకృష్ణ జోస్యం చెప్పారు. అనంతపురం(D) కల్లూరులో మాట్లాడుతూ.. ‘ఇసుక అమ్ముకుని CM జగన్ రూ.లక్షల కోట్లు సంపాదించారు. జే బ్రాండ్ పేరుతో మహిళల తాళి బొట్లు తెంచుతున్నారు. దళితులకు అండగా ఉంటానని చెప్పి హత్య చేస్తున్నారు. SC, STలకు చెందిన 25 పథకాలను రద్దు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారు’ అని మండిపడ్డారు.
ఫెయిర్‌నెస్ క్రీములతో భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో తేలింది. అధికంగా పాదరసం వాడటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ క్రీములను ఉపయోగించడంతో మెంబ్రేనస్ నెఫ్రోపతి(MN) కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తూ ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందని తెలిపింది. ఆరోగ్యానికి హాని చేసే ఈ తరహా ఉత్పత్తుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కోల్‌కతాతో డెబ్యూ మ్యాచ్‌లో లక్నో బౌలర్ షమర్ జోసెఫ్ ఘోరంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నారు. మూడు క్యాచ్‌లు సైతం వదిలేశారు. తొలి ఓవర్‌లో పది బాల్స్ వేసి (0, L1, 4, 2, b1, nb, Wd, Wd4, nb, 6) ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మొత్తం 7 వైడ్‌లు, 3 నో బాల్స్ వేశారు. అతని వల్లే మ్యాచ్ చేజారిపోయిందని లక్నో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటూ శ్రీ రమణ మహర్షి చెప్పిన వాక్యం తనకు ఎంతో నేర్పిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ సాధారణ వాక్యం విశ్వం మొత్తానికి అనుసంధానమై ఉంటుందన్నారు. దీనికి డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు వేశారు. ‘మరి మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు సార్? నా అంచనా ప్రకారం చంద్రబాబు గురించి తెలుసుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది’ అని రాసుకొచ్చారు.
ఈ నెల 17న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఆ రోజున భక్తులకు ప్రసాదం పంచేందుకు యూపీలోని మీర్జాపూర్ దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు 1,11,111 కిలోల లడ్డూలను తయారు చేస్తోంది. త్వరలోనే వాటిని అయోధ్యకు పంపుతామని ట్రస్టీ వెల్లడించారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున కూడా 40వేల కిలోల లడ్డూలను పంపినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.