India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్‌లో మాఫియా డాన్ అమీర్ సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. పాక్ జైల్లో భారతీయుడు సరబ్‌జిత్‌ను హత్య చేసింది ఇతడే కావడం గమనార్హం. లాహోర్‌లో ఉన్న అమీర్‌ను సమీపించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అమీర్ అక్కడికక్కడే హతమైనట్లు తెలుస్తోంది. గడచిన కొంతకాలంగా పాక్‌లోని గ్యాంగ్‌స్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అంతం చేస్తున్న సంగతి తెలిసిందే.
వాంఖడేలో ముంబై, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై జట్టు: ఇషాన్, రోహిత్, హార్దిక్, తిలక్, డేవిడ్, నబీ, షెపర్డ్, శ్రేయస్ గోపాల్, బుమ్రా, కొయెట్జీ, మధ్వాల్
చెన్నై జట్టు: రుతురాజ్, రచిన్, రహానే, దూబే, మిచెల్, జడేజా, రిజ్వీ, ధోనీ, శార్దూల్, తుషార్, ముస్తాఫిజుర్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. హోం గ్రౌండ్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకూ 73 మ్యాచ్‌ల్లో ఆ జట్టు సొంత మైదానంలో ఓడింది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 72 పర్యాయాలు ఓటమి పాలైంది. ఆతర్వాత ఆర్సీబీ (67) ఉంది. కాగా నిన్న రాజస్థాన్ చేతిలో పంజాబ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య ప్రస్తుతం ‘కంగువ’ మూవీ చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను మరింత పెంచాయి. ఇవాళ తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. సూర్య ఓవైపు వారియర్‌గా కత్తి పట్టుకుని.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ విడుదల చేసి 2024లోనే ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. సాల్ట్ 47 బంతుల్లో 89 పరుగులతో విరుచుకుపడగా.. శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 38 రన్స్) రాణించారు. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.
కన్నడ నటుడు దర్శన్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కాటేరా’ తెలుగు వెర్షన్ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తరుణ్ సుధీర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జగపతిబాబు, వినోద్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ వెర్షన్ రెండు నెలల కిందటే ఓటీటీలోకి రాగా, ఇప్పుడు తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది.
దేశాన్ని రక్షించుకునేందుకు అణ్వాయుధాలు కలిగి ఉండటం తప్పనిసరి అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. విపక్ష కూటమిలోని పార్టీలు అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రమాదకర హామీలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. శత్రుదేశాలు అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్న తరుణంలో మన వద్ద అవి లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. వీటిని వద్దని చెప్పేవారు దేశాన్ని ఎలా రక్షిస్తారని నిలదీశారు.
AP: జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను వస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ వస్తే గంజాయి వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. తన ప్రభుత్వంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. కేంద్రం సాయంతో ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
AP: గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. వారాహి యాత్రలో పాల్గొన్న పవన్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జనసైనికులు పోలీసులకు అప్పగించారు.
AP: విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ‘సీఎం జగన్‌పై దాడి దురదృష్టకరం. ఈ ఘటనపై CBI లేదా NIAతో విచారణ జరిపించాలి. సీఎం భద్రత విషయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా విఫలమయ్యారు. వారిని వెంటనే బదిలీ చేయాలి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.