News April 14, 2024

సీఎం జగన్‌పై దాడి ఘటన.. ECI ఆరా

image

AP: సీఎం జగన్‌పై రాయితో జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

News April 14, 2024

ఇజ్రాయెల్ ప్రతిదాడికి మా మద్దతుండదు: అమెరికా

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడి విషయంలో తమ మద్దతు ఉండదని అమెరికా తాజాగా తేల్చిచెప్పింది. ఇరాన్‌ దాడి నుంచి ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆ దేశం ఇరాన్‌పై చేసే ప్రతిదాడి విషయంలో తాము దూరం పాటిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌లో చెప్పినట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. అందుకు నెతన్యాహు కూడా అంగీకరించినట్లు సమాచారం.

News April 14, 2024

రాఘవా లారెన్స్‌ హీరోగా ‘BENZ’ మూవీ

image

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు. ఈసారి నిర్మాతగా వ్యవహరించనున్న అతడు రాఘవా లారెన్స్‌ హీరోగా ‘BENZ’ అనే మూవీని నిర్మిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సినిమాను బక్యరాజ్‌ కన్నన్‌ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్‌ కథను అందిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

News April 14, 2024

జగన్‌ను చంపాలని చూశారు: వెల్లంపల్లి

image

AP: జగన్‌ను చంపాలని కొందరు కుట్ర చేశారని YCP MLA వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ‘ఆయనను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక CM భద్రత తగ్గించారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ను ఏమీ పీకలేరు’ అని వ్యాఖ్యానించారు. కాగా దాడి ఘటనపై అజిత్ నగర్ పోలీసులు FIR నమోదు చేశారు. వెల్లంపల్లి ఫిర్యాదుతో ఆయన ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

News April 14, 2024

నా పెళ్లి అలా జరగాలి: జాన్వీకపూర్

image

తన పెళ్లి తిరుమలలో సంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ‘నా పెళ్లిలో నేను కాంచీపురం పట్టుచీర ధరించి.. మల్లెపూలు పెట్టుకోవాలని ఉంది. కాబోయే భర్త కూడా పంచె కట్టుకోవాలి. అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలి. నాకు కొంచెం సిగ్గు కాబట్టి కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తా. ఎక్కువమంది వస్తే నన్నే చూస్తుంటారు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంటుంది’ అని ఆమె చెప్పారు.

News April 14, 2024

రేపటి నుంచి బస్సు యాత్ర: అవినాశ్ రెడ్డి

image

AP: రేపటి నుంచి సీఎం బస్సు యాత్ర కొనసాగుతుందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై దాడి వెనక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఘటనపై ట్రోల్స్ చేస్తున్న టీడీపీ వైఖరి కుక్క తోక వంకర అనేలా ఉందన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం జగన్‌కు భద్రతను మరింత పెంచాలని కోరారు.

News April 14, 2024

ముంబైతో మ్యాచ్‌కూ పతిరణ దూరం!

image

గాయం కారణంగా ఇప్పటికే 2 మ్యాచులకు దూరమైన CSK బౌలర్ పతిరణ ఇవాళ MIతో మ్యాచులో ఆడటం కష్టమేనని CSK కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు. ‘పతిరణ గాయం అంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతడు మైదానంలోకి వస్తాడు. కానీ ఆయనకు కొంత విశ్రాంతి అవసరం. వంద శాతం ఫిట్‌గా ఉన్నప్పుడే తీసుకొస్తాం. లేదంటే అతడు మళ్లీ గాయపడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 14, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,139 మంది భక్తులు దర్శించుకోగా.. 39,849 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News April 14, 2024

సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ సింగిల్

image

దళపతి విజయ్, దర్శకుడు ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు హీరో విజయ్ ట్వీట్ చేశారు. ఈ పాటను స్వయంగా విజయ్ పాడటం గమనార్హం. కాగా ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారు. స్నేహ, మీనాక్షి చౌదరీ, ప్రశాంత్, ప్రభుదేవా తదితర భారీ తారాగణంతో మూవీ తెరకెక్కుతోంది.

News April 14, 2024

ఇరాన్-ఇజ్రాయెల్ బలాబలాలు ఇవే

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరాన్‌కు 6.1 లక్షలు, ఇజ్రాయెల్‌కు 1.7 లక్షల సైన్యం ఉంది. ఇరాన్‌కు 551, ఇజ్రాయెల్‌కు 612 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇరాన్‌కు 186, ఇజ్రాయెల్‌కు 241 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇరాన్‌కు 13, ఇజ్రాయెల్‌కు 48 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 1996, ఇజ్రాయెల్‌కు 1,370 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 19, ఇజ్రాయెల్‌కు 5 సబ్‌మెరైన్లు ఉన్నాయి.