India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం వైఎస్ జగన్‌పై నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ‘ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాగా.. ప్రధాని మోదీ ఇప్పటికే జగన్‌కు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
చీలమండ గాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అతడు ఆ తర్వాత ముంబై, లక్నో మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈ క్రమంలో మార్ష్ మిగిలిన మ్యాచ్‌లు ఆడటం సందేహమే. మరోవైపు ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వేలి గాయంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది.
AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి టీడీపీ కుట్రేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ‘సిద్ధం సభలు, బస్సుయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుడుతోంది. ఈ ఆదరణను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఈ దాడిపై లోకేశ్ నీచపు వ్యాఖ్యలు దారుణం. ఎవరైనా రాయితో ప్లాన్ చేసి కొట్టించుకుంటారా? లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే అనుమానం కలుగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. దీంతో పాటు దేశం మొత్తం ఉమ్మడి పౌరస్మృతి(UCC)ని అమలు చేస్తామని చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బ్లూప్రింట్ వంటిదని తెలిపారు.
AP: సీఎం జగన్‌పై దాడి విషయంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగింది రాళ్ల దాడి కాదన్నారు. ఎయిర్‌గన్‌తో చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘జగన్ నుదుటిని టార్గెట్ చేసి ఎయిర్‌గన్‌తో దాడి చేశారని భావిస్తున్నాం. ఆ పెల్లెట్ కంటికి తగిలి ఉండొచ్చు. షెడ్యూల్ వచ్చాక జగన్‌కు భద్రత కూడా తగ్గించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
రాయి దాడిలో గాయపడ్డ తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం జగన్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ మోదీ గారు’ అని జగన్ Xలో స్పందించారు. కాగా అర్ధరాత్రి గాయానికి ట్రీట్‌మెంట్ తర్వాత జగన్ కేసరపల్లికి వెళ్లారు. ఇవాళ అక్కడే రెస్ట్ తీసుకోనున్నారు.
AP: సీఎం జగన్ మీద దాడిని ఉద్దేశించి టీడీపీ నేత నారా <<13048311>>లోకేశ్<<>> చేసిన ట్వీట్‌పై ఆర్జీవీ కౌంటర్ ఎటాక్ చేశారు. ‘నీ ట్వీట్ నీకు బ్రెయిన్‌తో పాటు హృదయం లేదని నిరూపిస్తోంది. అంత కచ్చితత్వంతో రాయిని ఎలా విసిరారో నీకున్న కొద్దిపాటి జ్ఞానంతో వివరించాలి. కంటికి ఆ రాయి తగిలితే ఎలా ఉండేది? అప్పుడు కూడా జగన్ ప్లాన్ అని అనుకునేవాడివా?’ అని లోకేశ్‌ని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని PM మోదీ అన్నారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. ట్రాన్స్‌జెండర్లను ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగం చేస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తామన్నారు.
బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, భవిష్యత్తులో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ‘సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నాలుగు స్తంభాలతో ‘సంకల్ప్ పత్ర’కు పునాదులు వేసినట్లు చెప్పారు. ఇవాళ శుభదినమని.. ఐదు రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నామన్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామన్నారు. అనేక మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.