India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రాణాలకు తెగించి ఓ మహిళ చూపిన తెగువపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహబూబాబాద్(D) బంచరాయితండాకు చెందిన అనూష, నిఖిత, గౌతమి, శ్రుతి స్థానిక క్వారీ వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారి కేకలు విని పక్కనే గుడిసెలో ఉండే ఉప్పలమ్మ అనూష, శ్రుతి, గౌతమిని కాపాడింది. కానీ నిఖిత మాత్రం అప్పటికే పూర్తిగా మునిగిపోయి చనిపోయింది. ఉప్పలమ్మ సాహసంతో ముగ్గురి ప్రాణాలు దక్కాయి.
తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ సింగర్ చిత్ర ఎమోషనల్ అయ్యారు. ‘నువ్వు నాతో భౌతికంగా లేకపోయినా.. ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు. నా చివరి శ్వాస వరకూ నాతోనే ఉంటావు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా విజయ్ శంకర్ అనే వ్యక్తిని చిత్ర వివాహం చేసుకున్నారు. వీరికి 2002లో నందన అనే అమ్మాయి జన్మించింది. కానీ తొమ్మిదేళ్ల వయసులో నందన స్విమ్మింగ్‌పూల్‌లో పడి మరణించింది. ఆ సమయంలో చిత్ర దుబాయ్‌లో ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురైన సంగతి తెలిసిందే.
ముంబై వేదికగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య పోరులో ముంబైదే పైచేయిగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగ్గా ముంబై 20, చెన్నై 16 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. అలాగే వాంఖడేలో 11 మ్యాచ్‌లు జరగ్గా ముంబై 7, చెన్నై నాలుగింటిలో గెలిచాయి. కానీ గత సీజన్‌లో అటు ముంబై, ఇటు చెన్నైలోనూ CSKనే గెలిచింది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
TG: కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే ఇవాళ్టి నుంచి బుధవారం వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులు మళ్లీ ఎండలు పెరగనున్నాయని పేర్కొంది. 18, 19న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
TG: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. MP ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టం చేశారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. కాంగ్రెస్, BJPలతో దేశానికి ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో MIMకు విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇంకా హైదరాబాద్ MP అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉందనే ప్రచారం నేపథ్యంలో ఒవైసీ క్లారిటీ ఇచ్చారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ డేటా బ్యాకప్ ఆయన దగ్గర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడానికి ముందు పెన్‌డ్రైవ్‌లు, ఫ్లాష్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లలో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్ లభిస్తే నిందితులందరికీ శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా ఘటనపై నివేదిక పంపాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిని త్వరగా గుర్తించాలన్నారు. మరోవైపు సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.
TG: అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో షెడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పలు చోట్ల మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఎనిమిది సంస్థల షేర్లు రూ.10వేల మార్క్ అందుకున్నాయి. 2023 జూన్‌లో డిసా ఇండియా, వెంట్ ఇండియా, కేసీ ఇండస్ట్రీస్ రూ.10వేల మార్క్ చేరుకోగా ఆగస్టులో మారుతీ సుజుకీ, డిసెంబరులో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఆ మైలురాయిని తాకాయి. ఈ జాబితాలో ప్రస్తుతం రూ.18,416తో కేసీ ఇండస్ట్రీస్ షేర్ టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో డిసా ఇండియా (రూ.13,850), మారుతీ సుజుకీ (రూ.12,274) ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.