India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన మహిళ అనే కారణంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ మతంతో పాటు గిరిజనుల చరిత్ర, ఐడియాలజీపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో కుల గణన చేపడతామని అన్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్‌లో విచక్షణారహితంగా కత్తులతో చేసిన దాడిలో ఐదుగురు మరణించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితులపై కాల్పులకు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు మరణించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని, దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం, గాజువాకలో ఓడిన పవన్ కళ్యాణ్.. ఈసారి కొత్తగా పిఠాపురంలో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సెగ్మెంట్‌లో YCP నుంచి వంగా గీత బలమైన అభ్యర్థి అని పేర్కొన్నారు. మొదటి నుంచి జనసేనలో ఉన్నవారికి పవన్ న్యాయం చేయలేదని విమర్శించారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడ్డారేమోనని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశారు. గాయపడిన విషయాన్ని పాండ్య అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఐపీఎల్ సీజన్ తొలి రెండు మ్యాచుల్లో తొలి ఓవర్లలోనే బౌలింగ్‌కి వచ్చిన అతను, ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో ఒక్క ఓవర్ మాత్రమే వేశారని గుర్తుచేశారు. కచ్చితంగా అతనికి ఏదో జరిగిందని, అందుకే బౌలింగ్ వేయట్లేదని అభిప్రాయపడ్డారు.
గురుగ్రామ్‌లో షూ చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కి <<13036163>>నటుడు<<>> సోనూ సూద్ అండగా నిలిచారు. ‘స్విగ్గీ డెలివరీ బాయ్ ఎవరివైనా షూ చోరీ చేసుంటే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. అతడికి అవి అవసరమై ఆ పని చేసుండొచ్చు. మానవత్వంతో ఆలోచించి డెలివరీ బాయ్‌కి కొత్త షూ కొనివ్వండి’ అని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘అతడు పేదరికంలో ఉండొచ్చు. కానీ దొంగతనం నేరం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ IPL సీజన్‌లో ఐదుగురు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. రాజస్థాన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 5 మ్యాచ్‌లు ఆడి 25 రన్స్ చేసి స్ట్రగుల్ అవుతున్నారు. పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో 5 మ్యాచ్‌ల్లో 81 పరుగులే చేశారు. ఆర్సీబీ ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 6 మ్యాచ్‌ల్లో 32, కామెరూన్ గ్రీన్ 5 మ్యాచ్‌ల్లో 68 పరుగులే చేసి సతమతమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ బౌలర్ నోకియా 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 215 రన్స్ ఇచ్చారు.
APలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే నటుడు నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. జీవితంలో సక్సెస్ కావాలంటే పరీక్షలే మార్గం కాదన్నారు. హ్యాపీ డేస్ సినిమాలో రాజేశ్ ఒక్క ఇంగ్లిష్ పద్యంతో సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించడాన్ని ఉదహరించారు. విద్యార్థులు అలా ఉండాలని నిఖిల్ ట్వీట్ చేశారు. ఆ సినిమాలో రాజేశ్ పాత్రలో నిఖిల్ నటించి మెప్పించారు.
TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14 సీట్లు తెప్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఒకవేళ 14 ఎంపీ సీట్లు రాకపోతే సీఎం సీటు వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భూకబ్జాలు, సెటిల్‌మెంట్ల కోసమే రేవంత్ CM అయ్యారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
తొలిసారి బ్రేకప్ చెప్పిన తర్వాత తనకు పిచ్చెక్కినట్లు అయిందని హీరోయిన్ విద్యాబాలన్ తెలిపారు. ‘కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా. కానీ అతడు పోకిరి అని కొద్దిరోజులకే తెలిసింది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అనుకున్నా. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాం. అనంతరం కొందరిని ప్రేమించినా.. ఎవరితోనూ డీప్‌గా వెళ్లలేదు. కానీ డీప్‌గా ప్రేమించిన సిద్ధార్థనే పెళ్లి చేసుకున్నా’ అని ఆమె చెప్పారు.
TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈనెల 20 తర్వాత విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ప్రస్తుతం నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.