News April 13, 2024

జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటితో 105 ఏళ్లు

image

జలియన్ వాలాబాగ్ కాల్పుల ఘటన భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్‌లోని అమృత్‌సర్ ఉన్న ఒక తోట. 1919, ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు ఈ తోటలో సమావేశమైన ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాల్పుల్లో 379 మంది మరణించారు. కానీ 1000 మంది చనిపోయారనే వాదనలున్నాయి.

News April 13, 2024

CUET-UGకి తగ్గిన దరఖాస్తులు

image

CUET-UGకి ఈ ఏడాది 13.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు అప్లై చేశారు. ఈసారి 7.17 లక్షల మంది అబ్బాయిలు, 6.30 లక్షల మంది అమ్మాయిలు అప్లికేషన్స్ సమర్పించారు. ఈ ఏడాది అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టుకు 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు మే 15 నుంచి 31 వరకు జరగనున్నాయి.

News April 13, 2024

ఆ వార్తలు అవాస్తవం: జనసేన

image

AP: ఈనెల 17న కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న వార్తను జనసేన పార్టీ ఖండించింది. ‘కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో బీజేపీ తరఫున ఈ నెల 17న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు అవాస్తవం. 17వ తేదీన TDP చీఫ్ చంద్రబాబుతో కలిసి ఆయన కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటన ఇప్పటికే ఖరారయ్యింది’ అని ట్వీట్ చేసింది.

News April 13, 2024

జైలర్ సినిమాకు సీక్వెల్‌గా ‘హుకుం’?

image

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘హుకుం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయాన్’ (తెలుగులో వేటగాడు) అనే మూవీ చేస్తున్నారు.

News April 13, 2024

సీఎం పదవిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: సిద్ధరామయ్య

image

కర్ణాటక CM సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత తన పదవిని వదులుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను CMగా కొనసాగాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తే ఆ పదవిలోనే కొనసాగుతా. లేదంటే అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా. 4ఏళ్ల తర్వాత ప్రత్యక రాజకీయాల్లో ఉండను’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో NDAకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు రావని అన్నారు.

News April 13, 2024

2050 నాటికి జపాన్‌లో సగం జనాభా వృద్ధులే!

image

జపాన్‌లో జననాల రేటు తగ్గిపోవడంతో సామాజిక సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2050 నాటికి ఒంటరి వృద్ధుల(65 ఏళ్ల పైన) కుటుంబాల సంఖ్య 23.3 మిలియన్లకు చేరుకుంటుందని ఆ దేశ ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది. మొత్తం జనాభాలో ఇది 46.5 శాతమని పేర్కొంది. ఇటీవల కాలంలో జపాన్ యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపడం లేదు. టోక్యోలో మూడో వంతు మంది 50 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే ఉంటున్నారట.

News April 13, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 13, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:48
సూర్యోదయం: ఉదయం గం.6:02
జొహర్: మధ్యాహ్నం గం.12:17
అసర్: సాయంత్రం గం.4:43
మఘ్రిబ్: సాయంత్రం గం.6:32
ఇష: రాత్రి గం.07.46
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 13, 2024

ఒకే ఫ్రేమ్‌లో సచిన్, ధోనీ, రోహిత్.. ఫొటో వైరల్

image

భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్, ధోనీ, టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే చోట కనిపించారు. వీరు ముగ్గురూ కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చొని ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాడ్ షూటింగ్ కోసం వీరు ఒక్క చోట చేరినట్లు తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు లెజెండ్స్‌ని చూడటం బాగుందని, కోహ్లీ కూడా ఉంటే ఇంకా బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 13, 2024

ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

image

1919: పంజాబ్ జలియన్ వాలాబాగ్‌‌లో జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల్లో 379 మంది ఉద్యమకారులు మృతి
1999: నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం
1999: ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
* జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం